సౌమ్య గుణము (పద్యములు); - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్.- 9440522864.
81.ఆ.వె.
మారు మూల నున్న మాకేమి తెలియును
మీరు ముందు కొచ్చి మేలు చేసి
పద్య విద్య నేర్పి పైకి తెచ్చు నటుల
సౌమ్య గుణము విడక సాగవలయ!!

82.ఆ.వె.
తెనె లొలుకు భాష తెలుగు భాష యనుచు
అమ్మ భాష లోని కమ్మ దనపు 
కావ్య రచన జేసి కారుణ్యమొలకించు
సౌమ్య గుణము విడక సాగవలయు!!

83.ఆ.వె.
ఏది ధర్మమో మరేది నధర్మమో
తెలుసు కొన్న మనము తెలివి తోడ
నాచరించవచ్చు నా రామపథములో
సౌమ్య గుణము విడక సాగవలయు!!

84.ఆ.వె.
జనుల మేలు గోరి జనరంజక సహాయ
గుణము నీకు శోభ గూర్చు నెపుడు
మునుల మార్గ మందు ముక్తికై మెదులురా
సౌమ్య గుణము విడక సాగవలయు!!

85.ఆ.వె.
దైవ భక్తి యందు తగు నిష్ఠ నిలుపగ
నరున కుండవలెను నమ్మకమ్ము
విశ్వసించి భక్తి విశ్వాసము కలిగి
సౌమ్య గుణము విడక సాగవలయు!!
               (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు