91.ఆ.వె.లేత మనసు పిల్లలే మమతలు జల్లుకపట బుద్ది లేక కనుల వెలుగుఆటలాడినటుల మాటలు గనిపించుసౌమ్య గుణము విడక సాగవలయు!!92.ఆ.వె.వారి ధర్మ మెరిగి వారు నడువ వలెనితర ధర్మ మందు నిలువ వొద్దునీవు వెడలి చూడ నీకేమి కలుగునుసౌమ్య గుణము విడక సాగవలయు!!93.ఆ.వె.ఎవరి బాధ నైన యెవరు తీర్చగలరుఎవరి పాప ఫలిత మెటులబోవుపాప చింత మాని పాద సేవలు జేయుసౌమ్య గుణము విడక సాగవలయు!!94.ఆ.వె.ధరణి మీద నుండు ధర్మదేవతలనుకొలిచి యాచరించు కోటి పుణ్యకార్యములను జేయు కంకణధారివైసౌమ్య గుణము విడక సాగవలయు!!95.ఆ.వె.పాద సేవ లోనె పరమార్థముందనిమనసు నందు తలచి మాట నిలుపుసకల ప్రాణులందు సద్భావనకలిగిసౌమ్య గుణము విడక సాగవలయు!!
సౌమ్య గుణము (పద్యములు);కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి