హరివిల్లు రచనలు,; -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,- 9440522864.
 హరివిల్లు 21
🦚🦚🦚🦚
అనుదినము వేకువ
జామున నిద్రలేవవలె...!
అనునిత్యము సత్య 
వచనములే పలుకవలె...!
🦚🦚🦚🦚
హరివిల్లు 22
🦚🦚🦚🦚
పదవులు హోదాలు
శాశ్వతమైనవి కావు......!
పైరవీలు దందాలు
విశ్వసనీయత చాటవు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 23
🦚🦚🦚🦚
అనుదినం నీ నామమే
అభ్యసించి పలికెదను.......!
సర్వం శివ మయమే
విశ్వసించి తలచెదను..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 24
🦚🦚🦚🦚
దేవుడు లేడనడం
దోషము దృష్టిది.......!
దేవుడు కలడనడం
రహస్యం సృష్టిది..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 25
🦚🦚🦚🦚
అనంత కోటి కిరణ
తేజోమయుడు సూర్యుడు....!
అనంత జీవ రాశికి
జ్యోతిర్మయుడు శివుడు..........‌!!
                         (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు