నా పంచ పదుల సంఖ్య--
975.
ఆయన ప్రసిద్ధ ఐఏఎస్,
కలెక్టర్ అధికారి!
పలు హోదాల నిర్వహణ,
ఆయనకు ఆయనే సరి!
సాహిత్య లోకాన ఆంగ్ల ,
ఆంధ్ర భాష అక్షరాధికారి !
బహు దేశాల పర్యటన,
సాహితీ కార్యాల పూజారి!
సమాజాన స్థానవిలువ,
సాహిత్యన నిజవిలువ,
పివిఎల్!
976.
జననం తెలంగాణ ,
సిరికొండ గ్రామము!
సిరిసిల్ల హైదరాబాద్,
విద్యాభ్యాసము!
ఉస్మానియా వి.వి.లో
ఎం. ఏ (అర్థశాస్త్రము).
ఐఏఎస్ పరీక్ష ,
రాజేశ్వరి వివాహము
పరిపాలన, సృజనల,
భాగస్వామ్యము, పివిఎల్!
977.
సినారె స్ఫూర్తి ,ఎనిమిదవ,
ఏటనే కవితా ప్రాప్తి !
పద్యం, గేయం ,వచనం, విమర్శ అన్ని ప్రక్రియల దీప్తి!
"చైతన్య రేఖలు" ఆరంభం,
తెలుగు రచనల కీర్తి !
"లవింగ్ ఈజ్ లివింగ్" వంటి,
ఆంగ్ల రచనల శక్తి !
సామాజిక ,సాహిత్య, సాంస్కృతిక ,సంఘాలతో,
బంధము, పివిఎల్!
978.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య, అకాడమీచే పురస్కారము!
తెలంగాణ వారి, దాశరథీ,
సాహిత్య పురస్కారము!
"మన చేతుల్లోనే ఉంది",
తె.వి.వి, గ్రంథ పురస్కారము!
"విశ్వ కవుల సభ" ,
గౌరవ డాక్టరేట్ స్వీకారము!
హానరరీ డాక్టర్ ఆఫ్,
హ్యుమానిటీస్ ప్రధానము,
పివిఎల్!
_________'
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి