వివక్షతా! ఇంకెన్నాళ్లు పీడిస్తావ్!; -డా పివిఎల్ సుబ్బారావు. విజయనగరం. 94410 58797.
 క్రమ సంఖ్య: 46.
శీర్షిక :
పీడనం పరలోక పయనం!
1. 
   దృతరాష్ట్రుడి,
     పాండవ వివక్షతే ,
      కురు సంగ్రామ మూలం !
 
బ్రిటిష్ దమన నీతి ,
   భారత స్వాతంత్రోద్యమ, 
              ఆవిర్భావ కారణం! 
అనాదిగా తరతమ భేదాలే
   కులాలకురు క్షేత్రాలు, 
 మతాల రణాల తోరణాలు! 
మనిషి కాకూడదు,
 జార్ చక్రవర్తి,కావాలి ,
           మమతా సమవర్తి! 
ఓ మనిషి, ప్రపంచాన్ని కాదు, అరిషడ్వర్గాలని జయించు!
2.
ఆపేక్ష వీడకు, కక్షకట్టకు,
      స్వార్థం కక్ష్యలో తిరగకు! 
అణచివేత ప్రపంచాన,    
     అనేక విప్లవాల జన్మదాత! 
  ప్రతి నరుడు మార్తాండుడై,
                      మండేలా!
 
సంవత్సరాన ప్రతిడే మేడే,
              ప్రత్యర్థికి ఫ్రైడే!
3.
వివక్షత,
 చెదపురుగు చెప్పులు సిద్ధం! 
కాళీయుని పడగలు, అణిచివేసే అడుగుల యుద్ధం! 
కరోనా ఉక్కు  పిడికిలి,   
          పిడుగులు కురిపిస్తాం!  
మణిపూర్ ఘటన,    మహిళలంతా కాళీమాతలే!
4.
వివక్షతా! పాపం పండింది,
            ఆయువు  నిండింది!
పరలోక పయన ముహూర్తం,
            ఖరారు అయ్యింది !
కాలం కన్నెర్ర చేసింది,
              నీ కథ ముగిసింది!
_________

కామెంట్‌లు