సుజలాం ,సుఫలాం,
మలయజశీతలాం !
సారే జహాసే అచ్ఛా,
హిందూ సితా హమారా!
త్రిదిశ జల బంధనం,
ఓదిశ హిమహేమ సుందరం!
సనాతనద్వీపకల్పం ,
విశ్వాస ఉపఖండం !
గంగానది స్నానం,
గీత చూపిన మార్గం! హరితవనాల సొగసులు,
ఘనదేవాలయాల ఆశీస్సులు! యజ్ఞానికి వేదం ,
ఆయువుకి వేదం!
సంగీతానికి వేదం,
జీవన మూలం ధర్మం!
బుద్ధుని అహింస,
శంకర అద్వైతం !
రాముడి నడత,
కృష్ణుని చరిత!
భగత్ సింగ్ బలిదానం,
గాంధీజీ సత్యాగ్రహం!
నేతాజీ జైహింద్, తిలక్,
"స్వరాజ్యం నా జన్మ హక్కు"! వివేకానంద ప్రసంగ ప్రభలు,
రవీంద్ర కావ్య సుధలు!
అరవిందో తత్వ బోధలు,
మదర్ సేవా రీతులు!
పతంజలి యోగాసూత్రాలు, వాత్సాయన కామసూత్రాలు!
విశ్వకర్మ వాస్తు శాస్త్రాలు,
కౌటిల్యుని అర్ధనీతులు!
సాహితీసమరఖ్యాతి రాయలు,
పోరాట విఖ్యాతి అల్లూరి !
పరాక్రమ చత్రపతి శివాజీ,
పరమతసహన ఫాదర్ అక్బర్! విశ్వవిద్యాకేతనం,
శాంతినికేతనం!
పుణ్యారామం ,
సబర్మతి ఆశ్రమం!
ఏ దేశమేగినా ,
ఎందు కాలిడినా పొగడరా,
నీ జన్మ భూమి భారతి!
రాయప్రోలు అక్షరహారతి!
________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి