*జడివాన*;-...జాధవ్ పుండలిక్ రావు పాటిల్--భైంసా, నిర్మల్ జిల్లా.9441333315
ఆటవెలది.
కొండపోతవాన కురిసేను నిలలోన
అడవి పక్షులన్ని యలమటించె
కూడు గూడు లేక కూలేను బ్రతుకులు
వరుణ దేవ నీవు కరుణ జూపు.

పక్షి పిల్లలన్ని కుక్షిబాధ వలన
అలమటించె నేడు యల్ప ప్రాణి
గోడు పట్టదేల గోపాల కృష్ణయ్య
వీటి గోడు తీర్చు? విశ్వనాథ

కరుణ చూపు గుండె కనికరం మరిచేను
నారు పోసె వాడు నీరు పోసె
విధము మరిచిపోతె విశ్వాము సాగునా?
వినును వీటి బాధ విశ్వనాథ


కామెంట్‌లు