యుద్ధం.. .విధ్వంసక దృశ్యం
యుద్ధం .. ఒక వినాశక పంతం
యుద్ధం.. ఉభయ ప్రాణ నష్టం
యుద్ధం.. ఉభయ ఆస్తి నష్టం
యుద్ధం.. ఒక వ్యర్థం.
యుద్ధం.. భేషజాలకు నిలువుటద్దం
యుద్ధం.. విజయం ఒక మిథ్య
యుద్ధం..ఉభయ పక్షాల ఓటమి.
యుద్ధం..ఏలే వారికి ఆట
యుద్ధం.. పోరాడే వారికి ప్రాణ సంకటం
యుద్ధం.. క్షత గాత్రులకు క్షేత్రం
యుద్ధం.. సైనికుల ఆత్మార్పణం
యుద్ధం..మరణ మృదంగ నాదం
యుద్ధం...అనాథలకు మూలం.
యుద్ధం.. తిరోగమన సంక్షేమం.
యుద్ధం.. అభివృద్ధికి ఆటంకం..
యుద్ధం.. గెలుపు అన్నది శూన్యం
యుద్ధం.. ఉభయ దేశాల పతనం
యుద్ధం కావాలి అంతం
ప్రజలు మానాలి స్పర్థలు
స్వస్తి చెప్పాలి పంతాలకు
పాలకులు చేయాలి రాజీ
కుదరాలి శాంతి ఒడంబిక
పెట్టాలి అభివృద్ధి పై దృష్టి.
శాంతి సంక్షేమానికి సృష్టి.
పోటీ పడాలి అభివృద్ధి దేశాలతో
పాటు పడాలి ప్రపంచ శాంతికై
కృషి చేయాలి వసుధైక కుటుంబంకై
యుద్ధం కావాలి ఒక పీడ కల.
ఇరు దేశాలకు అదే కళ కళ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి