నా పంచ పదుల సంఖ్య---
967.
బాలల కథా రచయిత,, కార్టూనిస్ట్,ఉపాధ్యాయుడు!
కథలు, వ్యాసాలు వ్రాసి, పుస్తకాలుగా ప్రచురించాడు!
పది పైగా పుస్తకాలు రచించిన ,
ఓ సాహిత్యజ్జుడు!
"ఆనంద వృక్షం ",
"గజ్జల దెయ్యం ",
" విముక్తి " లు అందించాడు!
"పసిడి మొగ్గలు", "ఉపాయం", "మాతో పెట్టుకోకు" అన్నాడు,
పివిఎల్!
968.
బడిపిల్లగాల్ల కతలు,
కథలు ఓ సంచలనము!
తెలంగాణ మాండలిక,
తొలి బాలల సంకలనము!
వీరి కథలు మహారాష్ట్ర, పాఠ్యపుస్తకాల అంశము!
మన ప్రభుత్వ తెలుగు, పాఠ్యపుస్తకాల సృజనము!
"సాక్షర్ భారత్ వాచక",
సుందర రూపకల్పనము,
పివిఎల్!
969.
బాలసాహిత్య గ్రంధాల, ప్రచురణలో భాగస్వామ్యము!
బాలల పత్రిక "జాబిలి " కి,
సంపాదక సభ్యత్వము !
తె.వి.వి.బాల సాహితీ గ్రంథ, పురస్కార ప్రదానము!
"బాల సాహితీ రత్న",
శ్రీ శ్రీ పురస్కారాల ,స్వీకారము!
స్వచ్ఛంద సంస్థల ,
తెలంగాణ ప్రతిభా,
పురస్కారము , పివిఎల్!
______''__
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి