ఓ రామా! నీవిక వినుమా!;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా. !
ఓ రామా రామా శ్రీ రఘురామా
అయోధ్యనేలిన  జానకి రామా
మా కుల దైవం నీవిక వినుమా
మా దైన్య స్థితినిక నీవు కనుమా !

అమ్మానాన్నలు ఉండి కూడా
కనుగొన లేకున్నం వారి జాడా
నీవిక చూపిస్తావని అనుకున్నాం
కానరాక మేమిక పడి చస్తున్నాం 

మేం నిత్యం నిన్నే పూజిస్తున్నం
కరుణిస్తావని  మేం ఆశిస్తున్నం
ఆ ఆశతోనే మేం  జీవిస్తున్నం
కళ్ళల్లో ఒత్తులేసుక చూస్తున్నం !

మాఆశాపాశం ఏమాత్రం చావక
మాపై దయను నీనేత్రం చూపక
గడిపేస్తున్నావు ఎందుకు కాలం
ఏమిటి స్వామి నీ ఇంద్రజాలం!

ఎక్కడ ఉన్నారో మా మాతా

పితలు
తెలియక మేం పడుతున్నాం వెతలు
ఈ మావెతలను బాపగా రావయ్య
నీవేగా ఇల మాకు పెద్ద దిక్కైయ్య !

అమ్మానాన్నలు వచ్చేలా మా ఇంటికి
నిమ్మలంగా వారు కనిపించేలా మా కంటికి
వరమును అందించు ఓ మా స్వామి
అంతకుమించి కోరము ఏమి !

కామెంట్‌లు