బ్రహ్మదేవుడు సత్యలోకములో, విష్ణువు వైకుంఠంలో, శంకరుడు కైలాసంలో ఉంటారని అందరికీ తెలుసు. కానీ శివుడు ఎక్కడ ఉంటాడు అనే రహస్యం చాలా మందికి తెలియదు.
శివుడు సర్వ హృదయ నివాసుడు. ప్రతి జీవి హృదయములో ప్రకాశించే చైతన్యమే శివుడు. అందుకే స్కంద మహాపురాణం
"హ్రుత్పుండరీకాంతర సన్నివిష్టం."
హృదయ కమలమున కొలువైన దైవం శివుడని తెలిపినది.
అణుఅణువున ఈ విశ్వమంతా కొలువైన జ్ఞాన దీపమే శివుడు అందుకే శృతి.
సర్వ వ్యాపీ చ భగవాన్ తస్మాత్సర్వగతః శివః"
భగవంతుడైన శివుడు సర్వవ్యాపి అగుట వలన శివుడు సర్వమునందు కొలువై ఉన్నాడని తెలిపినది.
శివుడు సర్వ వ్యాపి. అంటే సర్వం వ్యాపించిన వాడు. విష్ణువు ఒక్క వైకుంఠంలోనే కొలువై ఉంటాడు.
కానీ శివుడు సర్వ లోకాలలో కొలువై ఉంటాడు. శంకరుడు ఒక్క కైలాసానికి పరిమితం. కానీ శివుడు సర్వ లోకాలలో అపరిమితంగా కొలువై ఉంటాడు.
ప్రతి దేవతకు ఒక లోకం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక లోకం ఉంది. ప్రతి ప్రాణికి ఒక లోకం ఉంది. కానీ ఈ సృష్టిలో లోకం లేని దైవం ఒక్క శివుడు మాత్రమే. కారణం శివుడు లోకాతీతుడు, విశ్వాతీతుడు. కాబట్టి శివుని యొక్క చిరునామా మన హృదయమే. శివుడు మన హృదయంలో ఉన్నంతవరకే నీవు చైతన్యవంతంగా ఉంటావు. శివుడు తప్పుకోగానే నీవు శవంగా మారిపోతావు. అందుకే రుద్ర హృదయోపనిషత్.
"శివః సర్వాత్మకః"
సర్వ జీవకోటికి ఆత్మ స్వరూపుడు శివుడని తెలిపినది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి