మా పల్లె ఏనుగు.....?;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
ఏనుగమ్మ ఏనుగు
పట్నం నుండి ఏనుగు
పల్లెకు వచ్చింది ఏనుగు
పిల్లలు మెచ్చిన ఏనుగు !

మా ఊరొచ్చిన ఈ ఏనుగు
మేం మెచ్చిన మా ఏనుగు
చెరుకు గడలను మేస్తుంది
బరువుల కూడా మోస్తుంది !

ఈ తెల్లని దంతాల ఏనుగు
మా ఉల్లం దోచిన ఏనుగు
చీమ కన్నులున్న ఏనుగు
చేట చెవులున్న ఏనుగు !

స్థూపం లాంటి నాలుగు కాళ్లు
పాపం మోయలేని దానిఒళ్ళు
కలిగి వస్తుంది మనముందుకు
మనకానందం కలిగించే టందుకు !


కామెంట్‌లు