ప్రతి కుటుంబంలోనూ తల్లిదండ్రులు పిల్లలకు దైవభక్తిని గురించి చెబుతూనే ఉంటారు భక్తిని గురించి చెబుతారు తప్ప ఆ భక్తి ఎవరిపై ఉండాలి ఆ భగవంతునికి ప్రత్యేకంగా పేరు ఏమైనా ఉన్నదా. ఆ పేరు గల భగవంతుని మాత్రమే మనం పూజించాలి అని ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులను అడిగితే వారికి సమాధానం తెలియదు కారణం వారి తల్లిదండ్రులు వారికి చెప్పిన పాపాన పోలేదు అసలు దేవుడు లేదా భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్నకు సమాధానం ఈ క్షణం వరకు దొరకలేదు ఎవరికి కనుక దానిని తెలుసుకోవడం కోసం జీవితమంతా తపస్సులో ఉండి చివరకు అది ఏమిటో తెలియక జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ప్రాణాలు విడిచిన యోగులు అనేకమంది ఉన్నారని మనకు చరిత్ర చెబుతోంది ఆ విషయాన్ని గురించి వేమనకు ప్రత్యేకమైన నిర్ణయం ఉంది.
తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని గుడికి వెళతారు వారితో గుడికి వెళ్లి ఆ గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షణ చేసి తరువాత లోపలికి వెళ్లి భగవత్ స్వరూపాన్ని చూసి కనులు మూసుకొని నమస్కరించి మనసులో వారికి కావలసిన కోరికలను ఆ భగవంతునికి చెప్పుకుంటూ వాటిని తీర్చమని అడగడం వేదంలో దీన్ని నమకం చమకం అని పిలుస్తారు ఈ కుర్రవాళ్ళు ఆ దృశ్యాన్ని చూసి ఏమనుకుంటారు ఎదురుగా కనిపిస్తున్నది రాతి బొమ్మ కదా దానికి ఎందుకు మొక్కుకోవాలి అలా చేసినందు వల్ల మన కోరికలు ఏమైనా తీర తాయా వారు కనిపించి భక్తులను ఆశీర్వదించి మీకు మీరు కోరిన కోరికలను అన్నిటిని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని హామీ ఏమైనా ఇస్తాడా అని ఆలోచించే వాడికి సమాధానం ఉందా.
వేమన ఈ విషయాల గురించి తన వివరణ ఇస్తూ ఏమంటున్నాడంటే ఈ శరీరము అనేటువంటి గుడిని తీసుకున్నట్లయితే దానిని దేవాలయంగా పాటించి దాని లోపల ఉన్నటువంటి ఆత్మను భగవత్ స్వరూపంగా మీరు కొలిచే దేవునిగా భావించి దానికి నీ మనసులో కోరికలను చెప్పి దానిని తీర్చుకోవడానికి నిశ్చల స్థితిలో నీ ప్రయత్నం నీవు చేస్తే అది భక్తునికి భగవంతునికి మధ్య సేతువుల ఉంటుంది అని చెప్తున్నా డు వేమన కనుక నిజానిజాలు ఏమిటో తెలుసుకొని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే జీవితం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అని తన అనుభవంతో వ్రాసిన ఈ పద్యాన్ని ఒకసారి చదవండి మీకు అర్థమవుతుంది.
"పడి పడి మ్రొక్కగ నేటికి గుడి లోపల కఠిన శిలల గుణములు చెడునా
గుడి దేహమాత్మ దేవుడు చెడురాళ్ళకు వట్టి పూజ సేతురు వేమ..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి