ఈ సమాజంలో కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం సిరి గలిగిన వాడిని నడమంత్రపు సిరి గలిగిన వాడిని ఒకసారి మీరు పరిశీలనగా చూడండి స్వతహసిద్ధంగా ధనవంతులుగా ఉన్న వ్యక్తులు సామాన్య జీవిఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఉంటారు. అదే నడమంత్రపు సిరి వచ్చిన వారు కొంతమంది ఉంటారు లాటరీలో లక్షలకు లక్షలు రానివ్వండి తన వారసురాండ్రు ఎవరైనా మరణిస్తే ఆ ఆస్తి రానివ్వండి వారి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది అందుకే సుంకరలాంటి గొప్ప రచయిత తాను రాసిన నాటకంలో అద్భుతమైన వాక్యం నడమంత్రపు సిరి వచ్చిన వాడిని నరం మీద లేచిన కురుపు అన్న పోలిక చేసి చెప్పడం ఆయన విజ్ఞతకు తార్కాణం. మామూలు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తులకు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి బ్రాహ్మణునిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తికి ఎంత భేదం ఉంటుందో తెలుసుకుంటే మానవ మనస్తత్వ విశేషం మనకు అర్థమవుతుంది మీరందరూ శూద్రులు మేము మాత్రమే బ్రాహ్మలం అని చెప్పుకునే వారి బ్రాహ్మణ్యం ఎంతవరకు బ్రాహ్మణ కులంలో పుట్టిన అంత మాత్రం చేత అతడు బ్రాహ్మణుడు అవుతున్నాడా అన్న విషయం ఆలోచించినట్లయితే పుట్టిన ఏ వ్యక్తి అయినా శూద్రుని గానే ఈ భూమి మీదకు వస్తాడు అన్న నగ్న సత్యం అతనికి తెలిస్తే తాను అహంభావంతో మాట్లాడే మాటలకు తానే సిగ్గుపడవలసి వస్తుంది కారణం శూద్రుడిగా పుట్టిన తాను ఇతరులను శూద్రులు అని ఎద్దేవా చేయడం ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది.
జన్మనా జాయతే శూద్రః అని వేదం చెప్తోంది ఈ భూమి మీదకు వచ్చిన ప్రతిప్రాణి శూద్రము తోనే వస్తుంది తల్లి ప్రేగుతో కలిసి వచ్చిన ఆ బిడ్డ బొడ్డు దగ్గర ఉన్న చిన్న బుడుపు లాంటి పదార్థం దాన్ని శూద్రము అంటారు దానిని వేరు చేసి భూమి మీదకు పంపిస్తాడు ఆ బిడ్డను వైద్యుడు ఆ తర్వాత విద్యార్థి దశ దాటి వేద విద్యను తన సొంతం చేసుకుని వేదములకు కూడా వ్యాఖ్యానం చేయగలిగిన పాండిత్యం ఎవడైతే సంపాదించుకుంటాడో బ్రహ్మజ్ఞానేతు బ్రాహ్మణ్యం అన్న వేద సూక్తికి తాను తగినవాడుగా ఉన్నాడని సమాజం అంగీకరిస్తుంది అంతే తప్ప మిడిమిడి జ్ఞానంతో వచ్చే వీరి మాటలను చేతలను పట్టించుకోవద్దు అంటాడు వేమన ఆ పద్యం ఒకసారి చదవండి చాలా అందంగా వేమన వ్రాసిన పద్యం.
"శూద్రులందు బుట్టి శూద్రుల దూషించి ద్విజులమనెడు పేరు నిజము జేసి మనసు నిల్పకున్న మరి శూద్రుడధముండు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి