అంకిత భావం ముఖ్యం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి జీవి అజ్ఞానంతోనే వస్తుంది. విజ్ఞానం కోసం తపిస్తూ వారి తల్లిదండ్రులు  మంచి గురువును ఎన్నిక చేసి వారి ద్వారా  విజ్ఞానులను చేయడానికి ప్రయత్నం చేస్తారు  దానిని అర్థం చేసుకొని  దాని పైనే మనసు లగ్నం చేసి  నేర్చుకున్న వాడు ఉన్నత స్థితికి వస్తాడు  ఏదో ఉద్యోగాల కోసం లేదా వ్యాపారం కోసం చదువుకున్నాం అన్న దృష్టితో దానిని  భౌతిక ఆలోచనలతోనే చేసిన వారు  లౌకిక సుఖాలను అనుభవించడం కోసం చదివించారు తప్ప  మిగిలిన విషయాలను గురించి ఆలోచించే అవసరం వారికి ఉండదు  అసలు ఈ లోకంలోనే ఏం చేయాలి అన్న ఆలోచన  వారి బుద్ధికి తోచదు  దానికి సరి అయిన  గురువు సహకారం కావాల్సి ఉంటుంది 
ఆంధ్ర భాషలో కానీ ఆంగ్ల భాషలో కానీ తనకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు  అతను చెప్పుకోవడానికి ఉద్యోగాలను సంపాదించడానికి  జ్ఞానాన్ని సముపార్జించుకున్నవాడు  పరలోక విషయాలను గురించి ఆలోచించే  వ్యవధి లేని వ్యక్తి  మోక్షానికి అర్హుడు కాదు  ఏమాత్రం. అతడు జ్ఞానం లేకుండా  జీవితంలో తాను ఏది సాటించాలని ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడో దాని ప్రాథమిక విషయాలను  కనుగొని  దానికి సరి అయిన శిక్షణ ఎవరి ద్వారా దొరుకుతుందో అని మంచి గురువును వెతికి వారి ద్వారా  తాను సాధించదలుచుకున్న ముక్తి  కోసం ప్రయత్నం చేస్తాడో నూటికి నూరుపాళ్ళు సఫలీకృతుడై  తాను  భగవంతుని లో కలిసి మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.
పెదవులు కదల్పకపోయినా తన సాధన కోసం మనసును కేంద్రీకరించి  ఓంకారము కానీ  పంచాక్షరిగానే అష్టాక్షరి గాని  తన స్వాధీనం  చేసుకొని ఏకాంత ప్రదేశంలో ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకొని అక్కడ తపస్సమాధి సిద్ధికి వెళితే  తాను నిజమైన బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకున్న సత్సంకల్పం  నెరవేరుతుంది  ఆత్మ జ్ఞానం ఎవరికి కలిగినదో  వారు అహం బ్రహ్మాస్మి  అన్న సూత్రాన్ని  తన సొంతం చేసుకున్న వాడు  ఎలాంటి చదువు లు లేకపోయినా  తాను అనుకున్న  లక్ష్యాన్ని చేర గలుగుతాడు అని చెబుతున్నాడు వేమన  ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.

"చదువులు జదివేటయ్యలు పదవిని బొందగ లేరు పరమార్థముగా పెదవులు గదలప కుండిన మదిలోనిది రాజయోగ మహిమము వేమా..."


కామెంట్‌లు