భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహాత్మా గాంధీ ఒక సందర్భంలో తన కుటీరంలో తన సన్నిహితులతో ముచ్చటిస్తూ సరదాగా చెప్పిన విషయమైనా సత్యమైనది నిత్యమైనది చెప్పారు ఈ లోకంలో మనుషులను రెండు రకాలుగా విభజించవచ్చు నేను నాది అన్న స్వార్థంతో తన బ్రతుకు తాను బ్రతుకుతున్న వారు ఒక రకం అయితే నా జన్మకు ఏదో కారణం ఉండి ఉంటుంది నాతో పాటు నా కుటుంబం ఉంది. ఇలా కుటుంబంతో పాటు సమాజం ఉంది సమాజంతో పాటు దేశం ఉంది దేశం కోసం పాటుపడని వారి జీవితం వృధా కనుక పరోపకార చింతనతో బ్రతికే వారు మరొక రకం ఈ రెండు రకాలను మనం పరిశీలనగా చూస్తే అసలు రహస్యం అర్థమవుతుంది. ఈ దేశంలో ఉన్న ప్రతి సంపద మనం అనుభవించడానికి ప్రకృతి ఏర్పాటు చేసినది అలాంటి అభిప్రాయంతో తన జీవితాన్ని వాటిని అనుభవించడం కోసమే ఖర్చు చేస్తూ ఉండే తత్వం కలిగిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు అలాకాకుండా జీవితంలో స్వశక్తిపై ఆధారపడి తమ జీవితాలను కొనసాగిస్తూ తనతో పాటు ఇతరుల సుఖాలను ఆనందాలను కూడా పంచుకోవాలని ఆశించే వ్యక్తులు మరికొంతమంది ఉంటారు ఒక్కమాటలో చెప్పాలంటే వీరిని తాను ఏదైనా మంచి పని చేయాలనుకుంటే తాను జీవించాలి ఆ జీవించడం కోసం నేను భోజనం చేయాలి అనుకునే వ్యక్తులు ఒకరకమైతే మనం తినడం కోసమే ఈ భూలోకము అంతకు మించిన పని మరొకటి ఈ జన్మకు లేదు అని తిండిపోతులా తయారయ్యేవాడు మరొక రకం అంటారు గాంధీ.
జీవిత పరమార్ధం ఏమిటో తెలుసుకోవడానికి భగవత్ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకొని మోక్షాన్ని పొందటానికి ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ చలిలో వణుకుతూ ఏకాంతంగా బ్రహ్మ స్వరూపం కోసమే తపన పడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు వారి జీవిత ఆశయాలను ఆకాంక్షలను కోరికలను తీర్చుకొని మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇలా తిండి కోసమే జీవించే వ్యక్తులకు ఆ జ్ఞానం ఈ జన్మలో వస్తుందా అని ప్రశ్నిస్తున్నాడు వేమన ఏ కార్యాన్నైనా సాధించాలంటే మానవునికి పట్టుదల ఉండాలి దేనికోసం తాను ప్రయత్నం చేస్తున్నాడో దాని మూలాలు తెలియాలి అప్పుడు చేసిన సాధనకు ఫలితం ఉంటుంది తప్ప ఒట్టి ఆలోచనలతో కార్యం నెరవేరదు అంటూ వ్రాసిన పద్యాన్ని ఒక్కసారి చదవండి.
"ఎండ యనక తిరుగు నీరు వెరింగిన యోగి యుండు నెల కాలముర్విలోన తిండిబోతు వశమె తెలియంగ జ్ఞానంబు... "

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి