జీవితంలో కొన్ని అపోహలు మూఢనమ్మకాలు ఉండడంవల్ల కొన్ని జీవితాలలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అవి మంచికి దారి తీయవచ్చు చెడు చేయడానికి ఆస్కారం ఉంటుంది మా అమ్మ అనే కాదు చాలామంది దురాభిప్రాయం భోగం అనే శబ్దానికి అర్థం తెలియక పోవడం వారి వృత్తి పట్ల అవగాహన లేకపోవడం భోగం మేళం అన్న శబ్దం ప్రాచర్యంలో ఉంది ఆ గ్రామంలో ఏ వివాహం జరిగినా వారి వాద్య బృందంతో సహా వచ్చి శుభకార్యం జరిగేంతవరకు వారి నృత్య ప్రదర్శన ఉంటుంది ఆ కార్యక్రమం జరిగేటప్పుడు నృత్య కళాకారిణి అనేక నానుడులతో ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంది ఎంతో ఆనందంగా ఆ కార్యక్రమాన్ని గుర్తు చేస్తారు.
ఆ రోజులలో నృత్య కళాకారిణులు అంటే వారే వారిలో బాగా చదువుకున్నవారు ఉన్నారు. రచనలు చేసిన వారు ఉన్నారు సమాజ హితం కోసం ప్రయత్నం చేసే రచనలు వారి నుంచి వస్తాయి వేరే మరొక స్త్రీలలో భాగం వేశ్య ఆమె ఆర్థిక పరిస్థితులు కావచ్చు వారి జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు బలవంతంగా వారిని అపహరించి తీసుకువెళ్లి ఆ వృత్తిలోకి దించవచ్చు రకరకాల పద్ధతుల వల్ల వారు ఆ వృత్తికి బానిసలవుతారు దానివల్ల వారి శరీరాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఆర్థికంగా వారికి వచ్చే లాభాలు ఏమి ఉండవు వాటిని నిర్వహించే వ్యక్తులు వీటి ద్వారా వ్యాపార రీత్యా ఎంతో ధనాన్ని సంపాదించిన వారు ఉన్నారు వీరు అమాయకంగా బలి అయిన వారు మాత్రమే రావూరి భరద్వాజ గారు వీరి గురించి సత్యాలతో రచనలు చేశారు కూడా. మా అమ్మ కూడా ఎంతో అమాయకంగా ఆ విషయాలనే నమ్మి దురభిప్రాయంతో నా వివాహానికి అంగీకరించలేదు ఆమెకు వివరించినా ఫలితం ఉండదు అని నిర్ణయించుకొని ఆమెకు ఏ విషయాన్ని గురించి చెప్పలేదు అలా కొంతకాలం గడిచిన తర్వాత నా తమ్ముళ్లకు వివాహాలు జరిగిన పిమ్మట వారి ప్రవర్తనను కుటుంబంలో అందరితో కలిసి మెలిసి ఆనందమయ జీవితానికి కారకులు కావడం నన్ను ఆలోచింపజేసింది నాకు వివాహం అయిన తర్వాత నా భార్య ద్వారా కూడా కుటుంబం అంతా ఇలాంటి ఆనందాన్ని అనుభవించవచ్చు కదా అలాంటి ఆలోచన కలిగి అమ్మతో నా మనసులో విషయం చెప్పాను తర్వాత ఆమెకు నచ్చిన ఆమె మెచ్చిన అమ్మాయిని చూసి వివాహం చేసింది. అమ్మ చాలా కాలం నా దగ్గరే ఉంది నా భార్య లక్ష్మి కూడా ఆమెను అమ్మలాగే ఆహ్వానించింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి