అమ్మ తనను తానే సముదాయించుకొని అది కాదు నాన్న నీ డ్యూటీ పూర్తిచేసి రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఇంటికి వస్తావు తలుపు కొట్టి అమ్మా అని పిలుస్తావు అప్పుడు ఎవరు తలుపు తీయాలి నేను ఉన్నప్పుడు మీ అమ్మతీయదు నేనే తీయాలి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది నేను కన్నాను కనుకనే కదా నాకు అధికారం ఉంది నాకు ఆ భాగ్యం లేకుండా పోయింది అని కంటనీరు పెడితే ఆ పాపం ఎవరిది అలా ప్రతి సంఘటనలోనూ నేను ఎంతోమానసిక ఆవేదనకు గురయ్యాను నీవు అన్నం పెట్టమంటే నేను పెట్టాలా ఆమె పెట్టాలా ఇలాంటి అతి చిన్న విషయాలను కూడా పట్టించుకుంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నా ఆలోచన అందుకే అన్నయ్యను చూడ బుద్ధి అవుతుంది వాడి దగ్గరికి వెళ్లి వస్తానని నీతో చెప్పి అక్కడ దించి రమ్మని అడిగాను.
నీవు మాచవరంలో కాపురం పెట్టి రేడియోలో పని చేస్తున్న సమయంలో నీకు అరుణకు సహాయంగా ఉండడం కోసం నేను మీ దగ్గర ఉన్నాను తర్వాత మీ అమ్మ కూడా వచ్చింది ఎంతో ఆనందంగా గడుస్తున్న సమయంలో నాకెందుకో అనుకోకుండా ఒక రోజు ఈ ఆలోచన వచ్చింది ఆమెను అమ్మ అని ఆప్యాయంగా నువ్వు పిలవడం నాకు చాలా ఆనందంగానే ఉంది కానీ అది మధ్యలో పోకూడదు అలా ఆలోచన నన్ను ఇలా చేసింది అంతే తప్ప వేరే ఏమీ కాదు అని చెప్పేసరికి అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది నీ పెంపకం మీద నీకు నమ్మకం లేదా నేను నీ మాట తప్పే వాడినా చిన్నప్పటినుంచి ఏది చెప్పినా తూచా తప్పకుండా చేస్తున్నాను కదమ్మా ఎందుకు నన్ను అనుమానించావ్ అనేసరికి ఎప్పుడు చూడని అమ్మ కంటి వెంట కన్నీటి ధార అప్పుడు చూశాను.
ఈ నాలుగు నెలలలో మీ దూరం దగ్గర అయ్యిందని నాకు తెలుసు ఈ క్షణాన రమ్మన్నా వస్తాను పద వెళదాం అనేసరికి నా తమ్ముడు తో పాటు నాకూ దుఖం ఆగలేదు మానసిక విశ్లేషణ చేయగలిగిన తత్వం ఆ శాస్త్రం చదివిన వాడికి మాత్రమే ఉంటుంది మిగిలిన వారు దానిని గురించి ఆలోచించరు అన్నఆలోచనతో ఉన్న నాకు ఎంత అమాయకంగా ఆలోచించానో అనిపించింది అమ్మలాంటి అమ్మలు ఎంతమంది ఈ దేశంలో ఉండి ఉంటారు అందరూ పట్నంలో పుట్టి పెరిగినవారేనా పల్లె ప్రాంతంలో ఉన్న వారికి ఆలోచనలు ఉండవా ఉదాత్తంగా ఉండటం ఆదర్శంగా ఆలోచించే అమ్మలు ఎంతమంది లేరు ఈ లోకంలో ఏమాత్రం చదువుకోని మా అమ్మే ఇలా ఉంటే మిగిలిన వారు ఎలా ఉంటారో అన్న ఆలోచన నన్ను తొలిచేసింది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి