నేను ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలు తిరిగిన వాడిని జీవితంలో కొన్ని నిర్దిష్టమైన ఆశయాలతో జీవించాలి అనుకున్న వాడిని నాన్న ఆశయాలకు ఆదర్శంగా జీవించి వారిలా బ్రతకాలని నా ఆకాంక్ష అందువల్ల వివాహం కూడా చేసుకోకూడదని ముందే నిర్ణయించుకున్నాను అనేక సందర్భాలలో నా ఉద్యోగాన్ని చూసి అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇవ్వడానికి సిద్ధపడినా నేను వ్యతిరేకించి వివాహం చేసుకోలేదు ఈ విషయంలో మా అమ్మ చాలా బాధ పడిన విషయం నాకు తెలుసు కానీ నా ఆశయం అడ్డు వచ్చి ఆమె కోరికలు తీర్చలేకపోయాను ఆ సందర్భంగా నాకు అత్తిలిలో ఉద్యోగం చేయడం ఒకరకంగా నా జీవితంలోమలుపు అనుకోవచ్చు అక్కడ పరిస్థితులు నాకు చాలా అనుకూలంగా ఉన్నాయి.
నేను నిజాయితీగా పని చేయడం ఎవరు అర్హులో వారిని మాత్రమే గుర్తించి వారికి తగిన స్థితిని కల్పించడం కోసం వారి ఇంటి దగ్గరే కూర్చుని వారు చేసేటువంటి చిన్న చిన్న పనులకు ఆర్థిక సహాయం చేస్తూ వారికి సహాయకారిగా ఉండడం మనకు పందులు ఉన్నాయి నల్ల పంది అది దళితులు తినేటటువంటి మాంసం అని మనవాళ్లు చెప్పుకుంటారు కానీ ఇతర దేశాలలో తెల్ల పొందులు ఉంటాయి అది తెల్లవారి ఆహారం దాని పిల్లలను తెప్పించి సంతానోత్పత్తి చేసి దానిని ఒక పరిశ్రమగా ప్రతి గ్రామంలోనూ పెంచేలా ప్రతి ఇంటిని పరిశ్రమగా పెంపొందించాలన్న అభిప్రాయంతో ముందుకు వచ్చే వారిని ఎన్నిక చేసి వారికి రెండు పందులను ఇచ్చి వాటి పెంపకానికి ఖర్చుకు డబ్బులు ప్రభుత్వంతోనే ఇప్పించి దానిని ఒక పరిశ్రమగా పెంపొందించాను.
ఈ విషయం తెలిసి మా చిన్నన్నయ్య కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తే వాడికి కూడా పంది పిల్లలను ఇచ్చాను వాటిని సొంత బిడ్డల్లా ఎంతో గారాంగా పెంచాడు వాటికి ముద్దుగా పేర్లు కూడా పెట్టుకునే వాడు ఏ పేరుతో పిలిస్తే అదే వచ్చేది వాడు వాటితో ఆడుకోవడం వాటికి సరదా బాగా పెరిగిన తర్వాత దాదాపు 100 వరకు ఉన్న గుంపులో ఒక పాము వచ్చి ఒక పందిని కాటు వేస్తే అది చనిపోయింది. దానిని కోసేటప్పుడు దగ్గర ఉండి అన్నయ్య చూడడంతో అసలు జీవితంలో వాడు మాంసాహార ప్రియుడు అలాంటివాడు దాదాపు రెండున్నర సంవత్సరాలు ఆ కూర అమ్మ చేస్తే కనీసం వాసన కూడా చూసేవాడు కాదు ఆ చనిపోయిన పంది గుర్తుకు వచ్చేది దీనినే మనము సెంటిమెంట్ అంటామేమో.
నా పేరు వేమన;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి