మా రెండో అన్నయ్య పుల్లారెడ్డి ఇది మా తాత గారి పేరు వాడు హాస్యానికి పెట్టింది పేరు వాడికి వయసు తెలిసినప్పటి నుంచి వామపక్షపాతులతో స్నేహం దానితో ఆ సిద్ధాంతాలకు కట్టుబడి వారితో తిరుగుతూ ఉండేవాడు ఇంట్లో ఎవరు ఎలా చెప్పినా వినేవాడు కాదు దొంగతనంగా వెళ్లి వచ్చేవాడు పార్టీ తరపు వారు ఏదైనా సాంస్కృతిక కార్యక్రమం చేయాలంటే నాటకాలు కానీ చిరు హాస్య రూపకాలు గానీ వేయాలంటే తననే ఎన్నుకునేవాడు గన్నవరం నుంచి విజయవాడ వచ్చిన పుచ్చలపల్లి సుందరయ్య గారు అన్నయ్యకు బాగా దగ్గరయ్యాడు వారి మాటలు గాని సిద్ధాంతాలు గాని వీడికి చాలా బాగా నచ్చినాయి సుందరయ్య గారు అనేక కార్యక్రమాలను ప్రతి గ్రామంలోనూ చేయాలని అభిప్రాయంతో నిరక్షరాస్యులైన ముసలి వారిని చేరదీసి వారికి చదువు చెప్పడం ముఖ్యం వారు చదువుకుంటే వారి కుటుంబం మొత్తం చదువుకుంటుంది అలాగే ప్రయాయంతో ఆ కార్యక్రమాన్ని సుందరయ్య గారి ఏర్పాటు చేస్తే దానికి అన్నయ్యను సంచాలకునిగా నియమించి దానికి కావలసిన ఏర్పాటు చేయమని చెప్పారు దానితో ప్రతిరోజు రాత్రి పొద్దు పోయిన తర్వాత 9 గంటల నుంచి పది గంటల వరకు చిన్న చిన్న కథలు ప్రారంభించి ముందు రామాయణం తర్వాత ప్రారంభం చివర భాగవతం లో ఉన్న చిన్న చిన్న కథలను వారికి తెలియజేసి దాని వలన వామపక్షపాత వ్యక్తులకు చేకూరే మంచిని గురించి చర్చించాడు ఇది చదువు నేర్చుకున్న ప్రతివారు పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ నాయకులకు కోపం వచ్చి అన్నయ్యలు వారించడానికి సిద్ధమయ్యారు. అయితే అక్కడ మా మేనమామ గారు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు గనుక వారందరూ కలిస్తే గ్రామంలో ఉన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ వారు ఏమి చేయలేని స్థితి దానితో వెనకకు తగ్గారు తర్వాత పాలేరుల విషయం వచ్చేసరికి కమ్యూనిస్టు పార్టీ నాయకుల వద్ద పనిచేస్తున్న పాలేరులను కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్ద పనిచేస్తున్న పాలేరులను ఒకచోట కూర్చోబెట్టి మీరందరూ కలిసికట్టుగా ఉంటే మీకు ఎలాంటి డోకా ఉండదు మీరు కోరిన కోరికలన్నీ తీర్చుకోవచ్చు అని వారికి హితబోధ చేసి వారిలో ఐక్యతను పెంపొందించడానికి కృషి చేశాడు అన్నయ్య వారందరూ కూడా పార్టీలో చేరడం వల్ల పార్టీ మరికొంత బలపడింది అని చెప్పవచ్చు అలా సామాజిక న్యాయం కోసం పాటుపడ్డవాడు అన్నయ్య.
మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి