మా పెద్ద అన్నయ్య కోటిరెడ్డి మా కుటుంబ బాధ్యత మొత్తం తన భుజస్కాంతాలపై వేసుకొని అమ్మ సహకారంతో కొనసాగించారు మమ్మల్ని క్రమశిక్షణతో పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు మా నాన్నకు అతి సన్నిహిత స్నేహితుడు కాకాని వెంకటరత్నం గారు మంత్రిగా ఉన్న సమయంలో అన్నయ్యను మద్రాస్ పంపించి శిక్షణ ఇప్పించి మా గ్రామంలోనే ఆయనకు ఉద్యోగం వచ్చేలా ఏర్పాటు చేశారు మా ఉన్నత పాఠశాలలో ఆయన చేరిన తరువాత క్రమశిక్షణతో ఆటలను నేర్పడం ఏ సమయంలో ఏది ఎలా ఆడాలో తెలియజేయడం చెడుగుడు కోకో లాంటి ఆటలపోటీలలో ఇతర పాఠశాలలకు కూడా వెళ్లి బహుమతులను గెలుచుకొని వచ్చిన రోజులు మా అన్నయ్య వచ్చిన తరువాతనే.
అన్నయ్య వచ్చేవరకు ఆటలు ఆడడానికి స్థలాన్ని కేటాయించిన వారు లేరు వీరు వచ్చిన తర్వాత చెడుగుడు కబాడీ బ్యాట్మెంటన్ వాలీబాల్ ఆటల్లో ప్రవీణులుగా చాలామంది ముందుకు వచ్చారు ఆడపిల్లలతో కూడా కోర్క్ బాల్ చక్కటి కళ కారిణులను తయారు చేశారు. మా గ్రామానికి మంచి పేరు తెచ్చిన ఆటగాళ్లు మిగిలిన జిల్లాలకు కూడా వెళ్లి బహుమతులనెన్నో తెచ్చారు ఆటగాళ్లకు కావలసిన దుస్తులను ఏర్పాటు చేయటం పాఠశాల చేయవలసినది అని ఆలోచించి విజయవాడ వెళ్లి తక్కువ ధరకు ఇచ్చే మంచి వస్తువులు దొరికే అంగడిని వెతికి అక్కడ తీసుకుంటే దానికి 25 శాతం కమిషన్ అన్నయ్యకు ఇవ్వబోయారు దానికి ఆయన తిరస్కరించి దానికి తగిన వస్తువులు ఇవ్వమని వస్తువులను తీసుకుని వచ్చినప్పుడు తన నిజాయితీని గుర్తించిన షాప్ యజమాని తాను ఇవ్వదలిచిన దానికన్నా ఎక్కువ ఇచ్చి పంపించడం ఆయన నిజాయితీకి గుర్తు
తర్వాత మా గ్రామంలో పేరంటాళ్లమ్మ తిరుణాల సందర్భంగా ప్రభలు కట్టుకుని ఊరేగింపుగా వచ్చే ఎడ్ల బండ్లకు అప్పుడు ఐదు రూపాయలు వసూలు చేసేవారు. ఎవరు పడితే వారు వసూలు చేయడం అది వారి జేబుల్లోకి వెళ్లడం చూసి సహించలేని అన్నయ్య ఒక సమావేశం ఏర్పాటు చేసి దానిలో కమిటీని వేసి పుస్తకాలలో లెక్కలు లేకుండా ఏ బండి దగ్గర డబ్బు వసూలు చేయడానికి వీలు లేదు ఆ వచ్చిన ధనం అమ్మవారికి వినియోగించాలి అని చెప్పి ఆ ఏర్పాటు చేశారు గ్రామంలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ నాయకులను ఒకచోట కూర్చోబెట్టి ఎవరి పార్టీలో వారు ఉండండి గ్రామానికి సంబంధించిన ప్రగతి కోసం పాటుపడండి అంతే తప్ప కొట్లాటలు వద్దు అని వారిని సక్రమ మార్గంలో పెట్టింది ఆయనే.
మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి