అత్తిలి లో ఉన్నప్పుడు నాకు సహాయకారిగా ఉంటున్న బ్రహ్మావతి అన్న ఉద్యోగిని నాకు ఎంతో చేదోదువాదోడుగా ఉంటూ నేను చేసే ప్రతి కార్యక్రమానికి ఆమె సహకరిస్తూ నాకు ఎంతో సన్నిహితంగా ఉండేది దానికి తగ్గట్టు నేను అద్దె ఇంట్లో ఉన్న ఇంటిలో మా ప్రక్క భాగంలోనే తను కూడా అద్దెకు వచ్చింది ఆమె తల్లి తనకు సహకారంగా ఉండేది అప్పుడు నేను మా అమ్మను మా చిన్న తమ్ముణ్ణి పిలిపించి ఇక్కడే ఉండే ఏర్పాటు చేసుకున్నాను అమ్మ వండి పెట్టేది రోజులు గడుస్తున్న కొలది బ్రహ్మావతితో సాన్నిహిత్యం పెరిగింది ఒకరి పద్ధతులు మరొకరికి బాగా నచ్చి చివరకు వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధపడే పరిస్థితి ఏర్పడింది అప్పటికే మా అమ్మకు ఆమె చాలా దగ్గర అయ్యింది.ఈ విషయం అమ్మకు చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నం చేశాను ఆ అమ్మాయి కులం ఏమిటి అని అడిగింది అమ్మ నిజానికి ఆ క్షణం వరకు నాకు ఆమె కులం తెలియదు తర్వాత తెలుసుకుని భోగం కులం అని చెప్పేసరికి అమ్మ ఏ పరిస్థితిలోనూ ఒప్పుకోనని చెప్పింది మీ నాన్న ఎన్నో కులాంతర మతాంతర వివాహాలు చేశారు అవన్నీ నాకు ఇష్టమే కానీ ఆ కులం అంటే నాకు అంతసదభిప్రాయం లేదు ఆ కులం తప్ప మరే కులంలో వివాహమాడినా నాకు అభ్యంతరం ఏమీ లేదు అని కరాఖండీగా చెప్పేసరికి నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఆలోచించి అమ్మకు ఇష్టం లేని పని చేయడం వద్దని జీవితంలో బ్రహ్మచారిగా ఉండడానికి నిర్ణయించుకున్నాను తర్వాత సంబంధాలు వచ్చినా నేను చేసుకోలేదు. మా చిన్నన్నయ్య నీవు వివాహం చేసుకోకపోతే మిగిలిన ఇద్దరి పెళ్లిళ్లు ఎలా చేస్తాం రా అంటే దానికి దీనికి ముడి పెట్టవద్దు మంచి సంబంధం వస్తే వాళ్లకు వివాహాలు చేయమంటే మా పెద్ద తమ్ముడికి వివాహం చేసాం తర్వాత మా చిన్న తమ్ముడికి మా నాన్న మేము అంతా ఆలోచించి గోరా గారితో సంప్రదించి ఆదర్శ వివాహం చేసాం. మా మరదలు మా ఇంటికి వచ్చిన తర్వాత వారి ప్రవర్తన చూసి సంసారంలో ఉన్న ఆనందం ఎలాంటిదో అర్థం చేసుకున్న తర్వాత అమ్మతో చెప్పాను నీ ఇష్టం నీకు ఎవరు నచ్చితే వారిని చేసుకుంటాను అని చెప్పేసరికి అమ్మ ఎంతో ఆనందించింది ఆమె ఆనందానికి అవధులు లేవు అలా నా వివాహానికి మార్గం ఏర్పడి అమ్మకు నచ్చిన సంబంధం చేసుకున్నాను అదీ నా వివాహ ప్రకరణం.
నా పేరు వేమన;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి