మా మూడవ అన్నయ్య పేరు వేమన రెడ్డి అన్నయ్యకు ఆ పేరు పెట్టడంలో ఒక విశేషం మా గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి మా నాన్న పూనుకొని తన దగ్గర ఉన్న అనేక వేదాంత గ్రంథాలను సమకూర్చి పెద్దల తో సంప్రదించి ఈ గ్రంథాలయానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచించి తర్జనభర్జనలు అయిన తరువాత వేమన పేరు బాగుంటుంది సమాజానికి సేవ చేసినవాడు ఆటవెలది పద్యానికి ప్రాణం పోసిన వాడు జీవిత సత్యాలను అతి చిన్న మాటలతో సామాన్య మానవులకు కూడా అర్థమయ్యే భాషలో రాసినవాడు కనుక సాహిత్య పరంగా వారి పేరు పెడితే బాగుంటుంది అన్న అభిప్రాయానికి వచ్చి గ్రంథాలయానికి ఆ పేరు పెట్టి వేమన గ్రంథాలయం స్థాపించి అన్నయ్యకు వేమన రెడ్డి అన్న పేరు పెట్టారు. అమ్మ, మా పెద్దన్నయ్యల సలహా ప్రకారం కాలేజీలో చేరి ఎం కామ్ పూర్తి చేసి జీవితంలో అడుగుపెట్టడానికి ముందు డాక్టర్ సమరం డాక్టర్ విజయం గార్లతో స్నేహం ఏర్పడడం దానితో గోరా గారు సన్నిహితులు కావడం వారి పర్ణ కుటీరాలలోనే వారితో పాటు ఉండడం దానితో వారి సిద్దాంతాలకు అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు మా నాన్న ఆదర్శాలు గోరా గారి బోధలు అన్నయ్యను పరిపూర్ణ వ్యక్తిగామార్చినాయి విద్యాభ్యాసం అయిన తర్వాత నాసిక్ వెళ్లి శిక్షణ పొంది అప్పుడే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన శాఖ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ దానిలో ఈవో గా చేరి బి డి ఓ (బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఉన్నత పదవిలో ఉండి జీవితంలో తన ఆశయాలను ఆదర్శప్రాయంగా కార్య రూపంలో చూపించాడు.
తాను ఉద్యోగంలో చేరిన తర్వాత దిగువ తరగతి ప్రజలకు ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నదో దానిని కార్య రూపంలో మార్చి ఉత్సాహవంతులైన యువతను చేర్చి అనేక రకాలుగా అతి చిన్న పరిశ్రమలను ప్రోత్సహించారు ప్రత్యేకించి ఇతర దేశాలలో ఉన్న తెల్ల పంది పిల్లలను తెచ్చి వాటి ద్వారా వ్యాపారం ఎలా చేయవచ్చును అనుకొని దానిని నిర్వహించడానికి కొంతమందిని పిలిచి వారందరికీ పిల్లలను పంచి ఇవ్వడంతో వారు పంది పిల్లల సంతానాన్ని విపరీతంగా పెంచి ఎంతోమంది ధనికులైన సంఘటన మనకు తెలుసు. బీద లైన చేతి వృత్తుల వారందరికీ ప్రభుత్వం చేత అన్ని రకాల సహకారాలను అందించి తాను చేయదలుచుకున్న ప్రజాహిత కార్యక్రమాలను అన్నిటినీ సమర్థవంతంగా చేసి చూపించిన వాడు మా వేమన అన్నయ్య.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి