అమ్మ ఓదార్చిన తర్వాత మామూలు స్థితికి వచ్చి నేను రేడియోలో చేరిన ప్రతివారం నేను నీతో మూడు రోజులు గడిపే వాడిని నాకు పెళ్లి అయిన తర్వాత నిన్నే తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకున్నాను నీవు లేకుండా నాకు ఏమీతోచదు అలాంటిది నాలుగు నెలల నుంచి నా దగ్గర లేకపోతే నాకు ఎలా ఉంటుంది నేనేమైనా ఇబ్బంది పెట్టానా నేను కానీ నిన్ను ఏమైనా అన్నానా నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగిందా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అన్నయ్య దగ్గరకు కూడా రావాలి కాదననుకానీ ఇన్ని రోజులా. అనేసరికి అమ్మ చిరునవ్వుతో మీ ఐదుగురిలో ఎవరినైనా నేను వేరుగా చూశానా అందరికీ తల్లి నే కదరా మీలో నాకు భేదభావం ఎందుకుంటుంది ఎందుకు అలా ఆలోచించి కుంగిపోతావ్ అనేసరికి వాడు ఆగలేకపోయాడు. వాడు తిరిగి ప్రవర మొదలు పెట్టక ముందే నీ వివాహానికి ముందు జరిగిన విషయాలు నీకు తెలియదు నీ పెళ్లి ముహూర్తం మరో ఐదు రోజులు ఉందనగా మీ అమ్మ వెంకాయమ్మ నా దగ్గరకు వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకొని అక్క అని ఏడ్చేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఆ కన్నీళ్లు ఎందుకు అమ్మ ఏ అత్త చేయలేని పని, చేయని పని నీవు చేసావు కన్న కూతురికి వివాహం ఎంతో వైభవంగా చేస్తారు తల్లిదండ్రులు అలాంటిది బాధ్యతగా ఆలోచించి అతిపెద్ద మనసుతో భర్తను పోగొట్టుకున్న కోడలికి తిరిగి వివాహం చేయాలన్న ఆలోచన రావడమే విశేషం అలాంటిది నీవు నా మరిది ఎంతో ప్రయత్నం చేసి గుణవంతుని కోసం వెతికి ఈ వివాహం చేస్తున్న సమయంలో ఇలా బాధపడవచ్చునా అంటే ఆమె
నా బాధ అందుకు కాదు అక్క ఉన్న ఒకే ఒక బిడ్డ నాకు కాకుండా పోయాడు నా జీవితంలో నన్ను అమ్మా అని ఇంకా ఎవరు పిలుస్తారు జీవితమంతా ఇలా గడపవలసిందే కదా అని తిరిగి కళ్ళ నీళ్లు పెట్టుకున్న తర్వాత చూడమ్మా మనం రక్తం పంచుకు పుట్టకపోయినా మనిద్దరం సొంత అక్కా చెల్లెళ్లమే వేరే భావాలు ఏమీ లేవు నాకు ఐదుగురు కొడుకులు వీడిని నీవు తీసుకువెళ్ళు నాకింకా నలుగురు ఉన్నారు వాళ్లంతా నన్ను అమ్మ అని పిలుస్తారు నాకే బాధ లేదు నీవు తీసుకెళ్లేవాడు నీ సొంత కొడుకు నీ జీవితాంతం నిన్ను అమ్మ అనే పిలుస్తాడు మీ అసలు బిడ్డను మరిపించేలా నీతో కలిసి ఉంటాడమ్మ వాడంటే నాకా నమ్మకం ఉంది వాడు అనుకున్నది తప్పకుండా చేస్తాడు నన్ను నమ్ము అని చెప్పేసరికి నన్ను కౌగిలించుకుని చంటి పిల్లలా ఒదిగిపోయింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి