నా పేరు వేమన;- - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఉద్యోగరీత్యా నేను నందిగామలో పనిచేస్తున్న సమయంలో  అప్పటివరకు విజయవాడ  మా చిన్న తమ్ముడు దగ్గరే ఉన్న అమ్మ నా దగ్గరకు వచ్చింది  అమ్మ ప్రక్కన ఉంటే ఆ ఆనందం వేరు ఆ తృప్తి వేరు  మా అందరికీ పండగే  మూడు నాలుగు నెలలు దాటిన తర్వాత ఒక రోజు అనుకోకుండా  తమ్ముడు చాలా కోపంగా వచ్చాడు  ఎందుకు వచ్చాడో అలా ఎందుకు ఉన్నాడో నాకు అర్థం కాలేదు  రావడం రావడమే చాలా కోపంగా ఉన్నాడు  మంచినీళ్లు ఇచ్చినా తీసుకోలేదు ఏరా  అమ్మకు నువ్వొక్కడివే నా కొడుకువి మేమంతా ఏమయ్యాం అనుకుంటున్నావు  నా దగ్గర ఉన్న అమ్మను నీ దగ్గరికి తీసుకొచ్చావు  ఎంత కాలం ఇక్కడ ఉంటుంది  అని నా పై నిందలు వేయటం మొదలు పెట్టాడు  వాడిస్వరం వినగానే అమ్మ వచ్చింది.
అమ్మను చూడగానే కౌగిలించుకొని ఏడుపు మొదలు పెట్టాడు  ఊరుకో నాన్నా అంటూ ఎంతో నచ్చ చెప్పినా దుఃఖం ఆగడం లేదు  అమ్మా నేనేం తప్పు చేశాను  నాకెందుకు దూరంగా  ఉన్నావ్  నేను రేడియోలో చేరిన కొత్తలో కూడా  వారానికి మూడు రోజులు నీకోసం వచ్చేవాడిని  నీవు లేకుండా నేను ఎలా ఉండగలను  అంటూ ఏడుస్తూ చెప్తుంటే నాకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి  అమ్మ కలగజేసుకొని  నువ్వు తప్పుచేయడం ఏమిట్రా  నేను అలా పెంచానా అంటూ ఆమె  కూడా దుఃఖించడం మొదలుపెట్టింది  ఇంతలో నా శ్రీమతి వచ్చి  ఊరుకో నాన్న అంటూ తమ్ముని  ఓదార్చింది  కొంత సమయం తర్వాత  అంతా సద్దు మణికి  కాఫీ తాగిన తర్వాత  అసలు విషయం ఏమిటి అంటే వాడు మాట్లాడడం మొదలుపెట్టాడు.
సామాన్యంగా మానవత్వం తత్వాలు ఎలా ఉంటాయంటే  పల్లెల్లో నివసించే వారు పట్టణాలలో నివసించేవారు  వారి వారి అలవాట్లతో పాటు వారి  స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటారు  పట్టణంలో ఉండడం అనేది ఏదో పెద్ద  అదృష్టంగా  మా గ్రామంలో నుంచి వచ్చిన ఒకే ఒక వ్యక్తిని నేను అంటూ  ఎంతో విర్రవీగి మాట్లాడుతూ ఉంటాడు  సంస్కారంలో కానీ  విషయ పరిజ్ఞానంలో కానీ  తనను  మించిన వారు మరెవరు లేరు అంటూ ప్రగల్భాలు పలకడం మీరంతా పల్లెటూరి బయతులు అని ఎద్దేవా చేయడం  సర్వసాధారణం. మా అమ్మ చెప్పిన సమాధానం విన్న తరువాత  ఎంత గొప్ప సంస్కారం  భవిష్యత్తు గురించి ఆలోచించడం పల్లెటూరి వారికి తెలిసినట్లుగా పట్టణ వాసులకు తెలియదేమో అని నాకు అర్థమైంది.

కామెంట్‌లు