పర చింతన; -ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
బిడ్డ తల్లి గర్భంలో ప్రాణం పోసుకోవడానికి 9 నెలలు పడుతుంది  ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అవతారాన్ని పొంది  చివరకు పూర్తి అవతారంతో  తల్లి గర్భం నుంచి  ఈ భూమి మీదకు వస్తుంది  చంటివాడిగా ఉయ్యాలలో ఊగులాడుతున్న వాడికి  ఈ ప్రపంచ పోకడ ఏదీ తెలియదు అర్థమయ్యే పరిస్థితి కాదు  వయసు పెరుగుతున్న కొలది  ఒక్కొక్క విషయాన్ని అవగాహన చేసుకుంటూ తల్లిదండ్రుల పెంపకంలో  ముందుకు నడుస్తూ ఉంటాడు  విద్యార్థి దశలో  ఉత్తముడిగా ఉండి మంచి  స్థానంలో ఉత్తీర్ణుడు కావడానికి  ప్రయత్నం చేసి సఫలీకృతుడై  తర్వాత జీవితంలో స్థిరపడానికి  తాను చదివిన  చదువుకు తగిన ఉద్యోగం  దొరకకపోతే వ్యాపారం చేయడమో  మరో పనిలోనో  స్థిర పడిపోతాడు. తన ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ  తన మనసుని కేంద్రీకరించి  తన శరీరానికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని ఆలోచించడానికి  ఆస్కారం  లేకుండా పోతుంది  ఈ మానవ శరీరం పెరగడానికి  ఆలోచించడానికి పనులు చేయడానికి ఏది ముఖ్యమో  జీవితంలో నాలుగు అవస్థలు దాటిన తర్వాత వృద్ధాప్యంలో అనుభవించవలసిన కష్టాలను కూడా  భరించి  అప్పుడు తత్వము అన్న విషయాన్ని  ఎవరైనా  జ్ఞాపకం చేసినా దానిని గురించి యోచన చేసే  జ్ఞానం  అతనికి ఉండదు  భౌతిక విషయాలపై దృష్టి కేంద్రీకరించిన వాడికి ఆధి భౌతిక విశేషాలు  ఎలా తెలుస్తాయి  గురుముఖతః  ఒక్కొక్క స్థితిని  అర్థం చేసుకుని దానిమీద మనసు కేంద్రీకరిస్తే  అప్పుడు తెలియడానికి అవకాశం ఉంటుంది  అసలు ఆ దృష్టి లేని వాడికి  అటు అసలు  మనసే మరలదు కదా...
ఈ జీవితం అనేది  ఈ తనువులో ఉన్న జీవి  ఆడించినట్లు ఆడే ఆట బొమ్మ అన్న విషయం  అతని స్మృతికి రాదు  అలాంటి వాడికి ఆధ్యాత్మిక చింతనతో కూడిన మోక్షం ఎలా వస్తుంది అన్నది  వేమన ప్రశ్న  ఇతని జీవితం అంతా ప్రతి విషయంలోనూ తాను తింటున్న తాగుతున్న నిద్రపోతున్నా ఏం చేస్తున్నా  అదంతా  నిత్యావసరంగానే కనిపిస్తుంది తప్ప  జీవితానికి సంబంధించిన  పుట్టుకకు పెరుగుదలకు మరణానికి సంబంధించింది కాదు  అనుకుంటాడే తప్ప  పుట్టినవాడు మరణిస్తాడు మరణించిన ప్రతివాడు  జన్మిస్తాడు అన్న విషయం కూడా తెలియని వాడికి  ఈ జీవితం భ్రమగానే  మిగులుతుంది తప్ప బ్రహ్మజ్ఞానం అనేది అతని మనసుకు రాదు అనేది  స్పష్టం  అంటున్నాడు  వేమన  మరి ఆ పద్యం చదవండి.
"తనువు దాననుగొను తను వాసన దగిలి జనన మరణములను జిక్కి చిక్కి పొలుపునొం దెరుగక పొర్లాడుచుండెడు భ్రాంతి జీవి కేటి పరము వేమ...

;-  

కామెంట్‌లు