కావ్య కన్యక (చిట్టి వ్యాసం);- :- డా. గౌరవరాజు సతీష్ కుమార్

 యాభైయ్యారక్షరాల మేళవింపు పూబోణీ! అచ్చులు హల్లులు ఉభయాక్షర పూర్ణబిందు విలాసినీ! ప్రాసానుప్రాస శ్లేషయమకాల విశేషభూషణ సౌరుతో, వచనవిభక్తి సంధిసమాస ఛందాలంకార సుశోభితమై తనరి, ద్రాక్ష కదళి నారికేళ పాకమైన మాటల హౌసుతో, చక్కని నుడికార జాతీయ సామెతల గుబాళింపు మీరి, రాగయుక్త గమకములను పలికించెడి జాణ! రామాయణ భారత భాగవతాఖ్య కథలతో ఇంపారి ప్రబంధబంధ కావ్యమై, ఖండకావ్య విరాజితమై, సౌందర్యనాదాల గంధర్వరాగాల రసరమ్య ఝరియై, హృద్యమైన రసధారల చోద్యమైన ప్రవాహమై, భావగంధమలదుకున్న కావ్యకన్యయే ఇది! సరసనుచేరి మురిపించి మరిపించి మున్ముందుకు నడిపించు. పండితపామరాది జనుల ప్రాపు చెలగి మెలగి, రాగుల విరాగుల మార్చి ఏమార్చు కన్యయే ఇది! తలచినచాలు మేను పులకింపజేసెడి కావ్యకన్యయే ఇది!!!
+++++++++++++++++++++++++.
కామెంట్‌లు