ముక్కున వేలేసుకుంది !; - కోరాడ నరసింహా రావు.
అన్యాయం జరిగినోడు... 
  న్యాయస్థానానికి వచ్చాడు !
 అన్యాయం చేసినోడూ... 
   న్యాయస్థానానికి రప్పించబడ్డాడు !!

వాదితరుపునవాదించేవాడూన్యాయవాదే !
 ప్రతి వాది తరపున వాదించేవాడూ... 
   న్యాయవాదే.. !!

చూసినదో - విన్నదో.... 
  ఉన్నది, ఉన్నట్టు చెప్పటానికో సాక్షీ వచ్చాడు !
 
 వాదోపవాదాలు జరుగుతున్నై !
  న్యాయమూర్తి ఇరువైపుల వాదనలూ వింటున్నాడు !
సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నారు !

చివరిగా.... 
వాది తరపు న్యాయవాది... 
  జస్టిస్ మి లార్డ్... అన్నాడు !
 ప్రతివాది తరపు న్యాయవాదీ 
  జస్టిస్ మి లార్డ్ అనే అన్నాడు !!
    తీర్పు వెలువడింది.... !
 అంతా గమనిస్తున్న న్యాయదేవత ముక్కున వేలేసుకుంది.... 
   తన సమక్షంలోనే... 
   జరిగిన అన్యాయానికి !!
       ******

కామెంట్‌లు