అవును! నాకు ఓపిక నశించిపోయింది. పిక్కపట్టుకుని పీకేశాను. బారెడు కండ ఊడింది. చెంబుడు రక్తం కారింది. వాడికి బొడ్డుచుట్టూ పద్నాలుగు ఇంజెక్షన్లు. నాకేమో ఒకటే! హ్హ! హ్హ! హ్హ! హ్హ! రోగం అణిగింది వెధవకు. మళ్ళీ ఎప్పుడూ నాతో పిచ్చి వేషాలు వెయ్యలేడు. అంటే......, వాడు నన్ను పడుకోనివ్వడు, అన్నం తిననివ్వడు. అస్తమానం నా కాలూ, చెవీ, తోకా లాగుతుంటాడు. నన్ను టీవీ ని , అద్దాన్ని చూడనివ్వడు. పూజగదిలోకీ, వాడిగదిలోకీ రానివ్వడు. అప్పుడప్పుడు డాడీతో నాపై చాడీలు చెప్పి నాకు బడితపూజ చేయిస్తుంటాడు. అందుకే , నేను సన్నీగాడిని గట్టిగా కొరికేశా! అలా చేస్తానని కలనైనా ఊహించ లేదు. మరి మీరూ జాగ్రత్త సుమా! సన్నీగాడిలా చేయకండి.
మీడాగీ కూడా నాలాగే చేయగలదు!!!
++++++++++++++++++++++++
జాగ్రత్త! (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి