లక్ష్మణుడు;- కొప్పరపు తాయారు
  శ్రీరామునికి ఎంతో ఇష్టమైన వాడు లక్ష్మణుడు.
అలాగే లక్ష్మణునికి రాముడంటే ‌.ప్రాణం.
         పద్నాలుగు సంవత్సరాల నిద్రాహారాలు లేకుండా ఉండాలి అందుకు నిద్రాదేవీని ప్రార్థించాడు
తనకు నిద్రరాకుండా కాపాడమని. అప్పుడు ఆమె అతనిని నిద్దరినీ ఎవరైనా తీసుకుంటే వీలవుతుంది
అని చెప్పింది. అప్పుడు లక్ష్మణుడు  నా భార్య ఊర్మిళ  దగ్గరికి  వెళ్ళమని ప్రార్థించాడు.ఆమె ఆ నిద్ధరని స్వీకరించింది. ఆ రకంగా లక్ష్మణుడు నిద్రని జయించాడు.
     అడవిలో   ఉన్నంతకాలం రాముడు   ఆహారం ఇస్తే దానిని ఓ చెట్టు కింద పెట్టేవాడు. ఆ విధంగా 14 సంవత్సరాలు ఆహారము నిద్ర లేకుండా  ఉన్నాడు లక్ష్మణుడు
         రావణుడితో యుద్ధం చేసినప్పుడు ఇంద్రజిత్తు సైన్యాన్ని చంపుతూ ఉంటే వానర్లని కోపంతో లక్ష్మణుడు  బ్రహ్మాస్త్రం వేద్దామంటే రాముడు వద్దని ఆపేడు అప్పుడు లక్ష్మణుడు ఒక మామూలు బాణాన్ని తీసుకొని ఈ శ్లోకం చెప్పాడు
      ధర్మాత్మ సత్య సంధ్యశ్చ రామో 
       దాశరథి యది పౌరుషేచ అప్రతిద్వంధః
       శరయేనం జహి రావణిన్ ,!!
దీని అర్థం ధర్మము సత్యము పితృ వాక్య పరిపాలనము రాముడు  దశరథ కుమారుడు
వీరత్వంలో తిరుగులేని వాడు అయితే ఈ నా బాణం రావణుడి పుత్రుడుని చంపుగాక అని బాణం వేస్తే అది వెళ్లి ఇంద్రజిత్తుని చంపింది.
            ఆ  విధంగా లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపాడు.!!

కామెంట్‌లు