హిందీ లో ఫక్కడ్ అంటే నిర్ధనుడు ఉపవాసాలతో ఉన్నా ఖుషీ ఖుషీగా ఉండేవాడు.బేఫికర్ గా ఖాతర్ చేయకుండా ఉన్న డబ్బంతా ఖర్చు చేసి భవిష్యత్తుని గురించి ఆలోచించనివాడు.సంస్కృతంలో ఫక్కికా అనే శబ్దం ఉంది.అశ్లీలంగా గలీజుమాటలు మాట్లాడేవా ఫజల్ అనే శబ్దం అరబ్బీ పదంఫజ్ల్ నించి వచ్చింది.అనుగ్రహం మెహర్బానీ కృప అని అర్ధాలు.
ఫణిచక్ర అర్థం జ్యోతిషంలోని నాడీచక్రం సర్పాకారంలో ఉంటుంది.వివాహసమయంలో వధూవరుల నాడీ కార్చేసింది లేదా అని చూస్తారు.
ఫణీశ్వర్ అంటే శేషనాగు వాసుకి.జ్యోతిషంలో ఫణీశ్వరచక్రం ఉంది.ఇందులో శని నక్షత్రం స్థితిని బట్టి సప్తద్వీపాల శుభాశుభాలు తెలుసుకుంటారు.ఫత్వా అంటే ముస్లిం మతగురువు మతసంబంధ వివాదాస్పద వ్యాఖ్యలకు శాస్త్రీయంగా లిఖిత పూర్వకంగా ఇచ్చే ఆదేశం.లజ్జ రాసిన తస్లీమా నస్రీన్ కి శాటనిక్ వర్సెస్ రాసిన సల్మాన్ రష్దీ కి మృత్యుదండన విధించింది ఫత్వా.కురాన్ కి విరుద్ధంగా రాశారని వారిపై ఆరోపణలు వచ్చాయి.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి