ఇంతకూ ఎవరది?;- - యామిజాల జగదీశ్
 వంద నల్లచీమలను...
వంద ఎర్ర చీమలను సేకరించి ఓ గాజు సీసాలో ఉంచితే ఏమీ జరగదు. ఒక్క సమస్యా తలెత్తదు.
కానీ ఆ సీసాను తీసుకుని బలంగా అటూ ఇటూ ఊపి బల్లమీద పెడితే ఏం జరుగుతుందో తెలుసా...
మీ కుదుపిన వేగానికి ఏమీ అర్థం కాని ఆ చీమలు ఒకటికొకటి గొడవపడతాయి. అంతెందుకు ప్రాణం తీయడానికీ వెనుకాడవు.
నల్లచీమలు ఎర్రచీమలే తమ శత్రువని, ఎర్రచీమలు నల్లచీమలే తమ శత్రువని నమ్ముతాయి. 
కానీ నిజానికి శత్రువు....ఆ గాజుసీసాను కుదిపిన వ్యక్తే. కానీ ఆ మనిషెవరో చీమలకు తెలియవు. తెలిసే అవకాశమూ లేదు.
అలా చేసిన వ్యక్తి హాయిగా ఓ కుర్చీలో కూర్చుని ఆ సీసా వంక ఆనందంగా చూస్తుంటాడు.
మన చుట్టూ ఉన్న సమాజంలోని పరిస్థితి కూడా ఇదే.
ఆడవాళ్ళు vs మగవాళ్ళూ
ఎడమ  vs కుడి
ధనికుడు vs పేదవాడు
నమ్మకం vs అపనమ్మకం
బలం vs బలహీనం
ఎటు చూసినా వదంతులే వదంతులు. ఉన్నవీ లేనివీ కల్పించి మాటలనేయడం. అవసరమా అనవసరమా అనేది అప్రస్తుతం. అర్థమున్నా లేకున్నా అబద్ధమో నిజమో కానీ మాటలనేయడానికి, తగవులు పెట్టడానికీ మనుషులెప్పుడూ అటూ ఇటూ తిరుగుతుంటారు గోడ మీది పిల్లిలా. 
ఏ విషయంలోనైనా మనకంటూ 
ఓ ఆలోచనా ఓ స్పృహ ఉండాలి.
నలుగురూ నాలుగు రకాలుగా చెప్పినా మనమూ ఆలోచించాలి.
ఎదుటి వ్యక్తితో గొడవపడే ముందర మనకు మనమే ఓ ప్రశ్న వేసుకోవాలి.
ఇంతకూ ఆ గాజుసీసాను కుదిపింది ఎవరు?

కామెంట్‌లు