మన గన్నవరం;- ఏ బి ఆనంద్, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం,

 వ్యాకరణ కర్తలు  తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అని చెబుతారు  ముందు తనను గురించి తాను ఆలోచించుకోవడం  తరువాత ఎదుటివారిని గురించి ఆ తర్వాత మాత్రమే ఎక్కడో ఉన్న వ్యక్తులను గురించి విషయాలను గురించి ఆలోచించడం సహజంగా జరిగే ప్రక్రియ  అలాగే ముందు నేను మా గ్రామంలో నా గురించి నా కుటుంబం గురించి తెలియజేసి  తరువాత నా గ్రామంలో ఉన్న మిగిలిన వర్గాన్ని ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తాను  నేను ఆకాశవాణిలో పనిచేస్తున్న వాడిని  ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ కాలక్షేపం చేస్తున్న వాడిని  సాహిత్య కార్యక్రమాలతో నాసాన్నిహిత్యం  చాలా రోజులు నుంచి జరుగుతోంది.
మా గ్రామంలో  వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నేను  లయోలా కళాశాలలో   పి యు సి  ఎస్ ఆర్ ఆర్- సివిఆర్ కళాశాలలో  బిఏ చదువుతున్న సమయంలో  నండూరి సుబ్బారావు గారి సహాయంతో ఆకాశవాణిలో చేరి  దాదాపు 2 వేల నాటకాలలో  పాల్గొన్నాను.  విజయవాడ కేంద్రంలోనే కాక  కడప విశాఖపట్నం కేంద్రాలలో కూడా నా ఉద్యోగ జీవితం గడిచింది  ఉపేంద్ర గారు ప్రసారశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నన్ను  ఢిల్లీలో  ఇతర దేశాలలో ఉన్న తెలుగువారి కోసం తెలుగు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు  దానికి ఈ ఎస్ డి  ఎక్స్టర్నల్  (సర్వీస్ డిపార్ట్మెంట్) అని పేరు పెట్టి  నన్ను మూడు నెలల క్రితమే  అక్కడకు రమ్మని ఆ బాధ్యతను నాకు అప్పగించారు  దానిని సక్రమంగా నిర్వహించానని అనుకుంటున్నాను.
తరువాత ఆకాశవాణిలో ఒకరికి చెప్పే స్థితికి ఎదిగిన తరువాత  ప్రభుత్వం వారు  ప్రాంతీయ రేడియో కేంద్రాలను ఏర్పాటు చేశారు  మొదట తిరుపతి వెళ్లి  అక్కడ కొత్త వాడికి  ప్రసార విశేషాలు ఎలా చెప్పాలో కార్యక్రమ నిర్వహణ ఎలా ఉండాలో  దానికి కాలాన్ని ఎలా వినియోగించాలో  చెప్పే పద్ధతిలో వినిపించేలా  స్పష్టత  ఉండాలి  అందరికీ అర్థమయ్యే భాషను ఉపయోగించాలి  అని చెప్పే వాడిని  అలాగే  కొత్తగూడెం వెళ్లి అక్కడ కొంతమందికి  తరువాత మార్కాపురం వెళ్లి అక్కడ మరి కొంతమందికి  పద్ధతులను చెప్పి వచ్చాను  హైదరాబాద్ మద్రాస్ కేంద్రాలలో పెద్దలతో నాటకాలలో కూడా  నేను నటిస్తూ నిర్వహించి  శ్రోతలను ఆకట్టుకునేలా  ప్రవర్తించాను  అది నా గురించి.
కామెంట్‌లు