మైక్రోప్లాస్టిక్! అచ్యుతుని రాజ్యశ్రీ

 సెలవుతో బైట వర్షం తో పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు. జయ పెదాలకి లిప్స్టిక్ పులిమితే శివా  పాలిష్టర్ డ్రెస్ వేసి లిప్ బామ్ పూస్తుంటే తాత గదిలోకి వెళ్ళి " మీరు వాడిన లిప్ స్టిక్ లిప్ బామ్ వల్ల చాలా నష్టం. వాటిలోనే కాదు సబ్బు పాలిస్టర్ నైలాన్ సిగరెట్ వల్ల డి.ఎన్.ఎ.లో మార్పు వస్తుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ""మైక్రోప్లాస్టిక్ అంటే ఏంటి తాతా?" "చెప్తా వినండి. ప్లాస్టిక్ లోని సూక్ష్మ 5మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న  ప్లాస్టిక్ వ్యర్థాలు.సముద్రం లో చేరి చేపలు మొదలైన జీవుల పొట్ట లో చేరుతాయి
అవి తినటం వల్ల మనుషులకు రకరకాల రోగాలు వస్తున్నాయి. మన చర్మంలో మైక్రోప్లాస్టిక్ చొచ్చుకు పోతుంది. నవజాత శిశువుల్లో ప్లెసెంటాలోకి పోతుంది. బట్టలతయారీవ్యర్ధ పదార్థాలు నీటిలో పోయి జలకాలుష్యం తథ్యం.మైక్రోప్లాస్టిక్ ఇంకోపేరుసెల్యులోజ్ ఎసిటట్
 ఫైబర్ సిగరెట్ వల్ల కూడా వస్తుంది. 100కోట్లమంది 6లక్షలకోట్ల సిగరెట్స్ ఏడాదిలో కాల్చి రోగాలు వ్యాప్తి చేస్తూ ఉన్నారు. లిప్స్టిక్ బామ్ వాడరాదు ". అంతే పిల్లలు వాళ్ళ అమ్మ వాడుతున్న లిప్స్టిక్ చెత్త కుండీలో పార్సిల్ వచ్చారు 🌺
కామెంట్‌లు