ప్రకృతి వెంటే నడక.;- .బి.అనసూయ.నిజామాబాద్

 ఎండకి చర్మం చిట్లి చెమట
అది నీరే
వానకి భయంకరమైన వరద
ఇదీ నీరే
అప్పుడూ చిరాకే మనకు వాసనతో
ఇప్పుడూ చింత ఇల్లంతా నీళ్లతో
మనిషికి సౌకర్యం ఎన్నుకునే
అవకాశం లేనేలేదు
ప్రకృతి వెంట ఉస్సురంటు
నడుచుడు తప్ప
ఐనా పట్టలేని గర్వం
ఎన్ని కాలాలు చూసిన
అదేనండి మరి మానవుడికి
దేవుడిచ్చిన వరాలు
ఆశ,మోహం,అహంకారం
వీటితోనే అన్నీ మర్చి జీవిస్తున్నాం.
కామెంట్‌లు