చేతలే ఇక!(చిట్టి వ్యాసం);- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 ఏం మాటాడమంటావు? ఏం చేయమంటావు? ఏం మాటాడి ఏం ప్రయోజనం? అసలు మాటాడితే ఏమన్నా అయిపోతుందా? ఇక మాటల్లేవు. మాట్లాడుకోవడాల్లేవు.
పోరాటమే చివరి ఆయుధం. అంగఛ్ఛేదమే ఇక తరువాయి కార్యం.
నలుగురిలో నామాలు పెడితే గోడచాటుకు పోయి గోకేసుకునేవాడితో
ఇంకేం మాటలు? బ్రహ్మ దేవుడి రాతను కూడా మార్చేసే దుండగులకు గుండు గొరిగించి సున్నంబొట్లతో ప్రపంచమంతా తెలిసేట్లు గాడిదలపైతిప్పి చంపాలి.
ఘోరాతి ఘోరమైన శిక్షలు సత్వరం అమలు జరిపితేకాని దుర్మార్గుల దుష్టక్రీడ అంతం అవదు. అందుకే మాకు మాటల్లేవు. చేతలే ఇక!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు