త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు. అయితే పాపభూయిష్టాఇన ఈ కలియుగంలో దానధర్మాలు, దైవారాధన, నామ పారాయణ, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్షమార్గాన్ని మన శాస్త్రాలు మనకు ప్రసాదించాయి. అయితే మనకు నిర్దేశించిన వివ్ధ దానాల్లో అన్నదానం, వస్తద్రానం, జలదానం గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవి. మనిషిని సంతృప్తిపరచేది అన్నదానము. దాహార్తిని తీర్చేది జలదానం. వస్తద్రానం చేస్తే సాక్షాత్తూ ఆ భగవంతుడికే వస్త్రాన్నిచ్చిన పుణ్యం కలుగుతుంది. మనం చేసే దానంలో స్వార్థం లేకుండా, ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దేవుడే దానాన్ని గ్రహించడానికి వస్తాడని శాస్త్ర వాక్యం. కర్ణుడు, బలిచక్రవర్తి మొదలైనవారి దగ్గరికి భగవంతుడే యాచకుడిగా వచ్చి దానం స్వీకరించి, వారికి మోక్షాన్ని ప్రసాదించినాడు అని మన పురాణాలలో తెలుపబడింది. ఒక మనిషి మరణించినా, అతడు చేసిన దానధర్మాలవలన ఆజన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్న విషయానికి ప్రామాణికంగా ఎందరో చరిత్రలో నిలిచారు.అయితే అన్నింటికన్న ముఖ్యమైనది గోదానాని పేర్కొన్నారు.గోదానం చేయడం వల్ల దానం చేసినటువంటి వారే కాక వారి వంశములోని ముందు పది తరాలవారు ఏదైనా పాపం చేసి ఉన్నప్పటికీ వారి వంశంలో ఒక్కరు గోదానం చేయడం వల్ల వారు పుణ్యలోకాలలోకి పంపబడతారు.శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ.. మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని యమధర్మరాజు వివరించాడు. చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో వున్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో వుండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నాచికేతుడు తండ్రికి తెలిపాడు.
అన్నిదానాలలోకి గోదానం అతి శ్రేష్టమైనది- : సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి