నాలుక రుచి:-ఎస్ మౌనిక
• T. VEDANTA SURY
హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు?నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? ఈరోజు మీరు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా మీ నేస్తం మీ ముందు ఉంది. ఇంకో కొత్త విషయం తీసుకొని వచ్చానుగా..... మనం ఈరోజు ఒక చిన్న ప్రయోగం చేద్దాం..... నోట్లో ఒక స్వీట్ పెట్టుకుందాం..... ఆహా! చాలా తీయగా ఉంటుంది. మిఠాయిల ప్రియులకు ఇక ఆనందమే ఆనందం...... ఇందులో నేను కూడా ఒకరిని....అసలు ఇది ఎలా జరుగుతుంది? దీని వెనుక ఉన్న అసలైన కారణమేంటి? అదేనండి ఈరోజు మన అంశం.. మనకి రుచి తెలియాలంటే నాలుకే కాకుండా ఇంకా కొన్ని అవయవాలు కూడా పనిచేయాలి. నాలుక పైన రుచులు ఉంటాయి కదా! ఈ రుచి మొగ్గలు చిన్న గుళికలను కలిగి పైన తెరుచుకొని ఉంటాయి.వాటిలో రుచిని తెలిపే జ్ఞానకణాలు ఉంటాయి. ఏదైనా ఆహారాన్ని మనం నాలుకపై ఉంచినప్పుడు అది లాలాజల గ్రంధులు స్రవించే లాలాజలంలో కరిగిపోతుంది. నాలుక అంగిలిని నొక్కినప్పుడు ఆహార పదార్థం రుచి మొగ్గ యొక్క ద్వారాన్ని నొక్కి జ్ఞాన కణాలను చేరి రుచి సంకేతాలను మెదడుకు పంపిస్తుంది. ఈ సమాచారం మెదడుకు చేరగానే మెదడు రుచిని గుర్తిస్తుంది. ఈ ప్రక్రియలో ముక్కు దాని యొక్క వాసన గ్రహకాలు కూడా ఒక భాగమే..... దీనిలో ఎంత పెద్ద ప్రక్రియ ఉందా అనిపిస్తుంది కదూ..... మొదటిసారి చదివినప్పుడు నేను అనుకున్నది కూడా అదేనండి! ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్! నేను నేస్తం ఎప్పుడు రెడీగా ఉంటుంది. మళ్లీ మిమ్మల్ని త్వరలో కలవడానికి ఎదురు చూస్తూ ఉంటాను. మళ్లీ కలుద్దామా? ఫ్రెండ్స్! మనం త్వరలో కలుద్దాం. బాయ్👋👋ఫ్రెండ్స్...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి