చినుకమ్మ సందడి;- -'బాలబంధు' గద్వాల సోమన్న
చినుకు చినుకు కలిసింది
నేల గుండె తాకింది
చిటపట శబ్దంతో
సందడే చేసింది

తరువులకు తల స్నానం
చినుకమ్మ చేసింది
చిరు పైరుకు ఊపిరి
ప్రేమతో పోసింది

రైతన్నల ఆశలకు
బాసటగా నిలసింది
చెరువులకి,వాగులకు
జలకళనే తెచ్చింది

చినుకమ్మ రాకతో
కొత్తదనం వచ్చింది
అంతటా పచ్చదనం
తొంగితొంగి చూసింది


కామెంట్‌లు