జ్యోతి కలశం ఒలికితే
కాంతి ధారగా కురిసి
నీట కరిగి పుత్తడి ప్రవాహంగా
జాలువారుతుంటే..
నింగి మొత్తం బెంగతో
మోము ఎర్రగా చేసుకుని
కడలి వైపు సాగుతున్న
నదీకన్య పరవళ్ళను
నీరునిండిన మబ్బుల కళ్ళతో
కనుచూపు మేర వరకూ
జలపాతపు రూపుని
కళ్ళ నింపుకుంటూ
కష్టం కలుగకుండా
చూసుకొమ్మని గిరులకూ
ఒంటరిగా సాగే ఏరును
కంట కనిపెట్టమని తరువులకూ
మౌనంగా గుండెలోని
వేదనంతా నివేదించుకుంటూ
క్షేమంగా వెళ్ళి సంద్రం చేరి
మళ్లీ తన ఒడికే వచ్చేయమని
తనకోసం వేయికళ్ళతో
ఎదురుచూస్తుంటాననీ
ప్రియమారగ ప్రియుని చేరి
ముదమారగ ఒదగమంటోంది
మనసారగ దీవించి
కలలు తీరగ కనికరించి
కలతలెరుగని కమ్మనైన
మనుగడ నివ్వమని వేడుతూ
వెలుగుల వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి