జ్ఞాపక శక్తి జ్ఞానం;- ఎస్. మౌనిక

 హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్.... ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ...... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే🤝🤝...ఈరోజు ఇంకో కొత్తదైనా ఆసక్తికరమైన విషయంతో మీ నేస్తం మీ ముందుకు వచ్చేసింది గా!....  మీరు రెడీనా మరి! తెలుసుకుందామా అదేంటో!.... జ్ఞాపకశక్తి..... ఈ పదం తెలియని వాళ్ళు మనలో ఎవరు ఉండరు... నిజమేనా? నేర్చుకున్న విషయాలను గుర్తు పెట్టుకోవడం అనేది జ్ఞాపకశక్తి మీద ఆధారపడి ఉంటుంది. నిత్యజీవితంలో జరిగే సంఘటనను మనం ఏ విధంగా గుర్తు పెట్టుకుంటాం అనేదానికి రెండు సిద్ధాంతాలు ప్రతిపాదించడం జరిగింది. మొదటి సిద్ధాంతం ప్రకారం జ్ఞాపకశక్తి అనేది ఒక చైతన్య చర్యగా చెప్పవచ్చు. మనం ఏదన్నా నేర్చుకుంటే లేదా అనుభవిస్తే మన శరీరంలోని నాడులు స్పందిస్తాయి. ఈ నాడీ స్పందనలే మెదడులోని న్యూరాన్ల (nerve cells)మీద తమ ప్రభావం చూపుతాయి. ఈ సిద్ధాంతాన్ని అయితే చాలామంది శాస్త్రజ్ఞులు ఒప్పుకున్నారు. మరి ఇంకో సిద్ధాంతం ఏమిటంటే మెదడు మీద శాశ్వతమైన మార్పులు వస్తాయి అన్నది. మనం ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు మెదడు మీద శాశ్వతమైన మార్పులు వస్తాయి. అవి జ్ఞాపకశక్తి రూపంలో అలానే నిలిచిపోతాయి. మెదడులో ఉన్న న్యూక్లిక్ యాసిడ్, ఆర్.ఎన్. ఎ ఆ సమాచారాన్ని పదిల పరుస్తుందని అనుకుంటున్నారు. మూడేళ్ల నుండి 45 ఏళ్ల వరకు కూడా న్యూరాన్ లో ఉన్న ఆర్. ఎన్.ఏ పరిమాణం పెరుగుతూ ఉంటుందని తాజాగా తెలుసుకున్నారు. ఈ ఆర్. ఎన్. ఏ పరిమాణం 40 నుండి 55 లేదా 60 ఏళ్ల వయసు వరకు స్థిరంగా ఉంటుందట..... అందువల్ల ఆ వయసులో ఉన్నప్పుడు మనిషి జ్ఞాపకశక్తిలో ఏ విధమైన మార్పు మనం గమనించలేము... 60 వ సంవత్సరం నుండి ఆర్. ఎన్.ఏ బలహీనత చెంది జ్ఞాపకశక్తి అనేది క్షీణిస్తుంది. చాలా కొత్తగా ఉంది కదూ ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే టచ్ లో ఉండండి ఫ్రెండ్స్ మొలకతో!... మన మళ్లీ ఇటువంటి ఇంకో కొత్త విషయంతో త్వరలో కలుద్దామా?  బాయ్ ఫ్రెండ్స్!
కామెంట్‌లు