చార్మినార్ మస్జిద్ ప్రతివైపు 20 మీటర్ల పొడవు కలిగిన ఒక చతురస్రాకార నిర్మాణం. నాలుగు దివ్యమైన ఆర్చీలతో ప్రతి ముఖం నాలుగు వీధులలో ఒక్కొక్క వీధి వైపు తెరుచుకునేటట్లు ఉంటుంది. ప్రతి మూల వద్ద ఒక అద్భుతమైన ఆకారంలో 56 మీటర్ల సుమారుగా 184 అడుగులు ఎత్తు గల మినార్ రెండు అంతస్తులలో ఉంటుంది. పూరేకుల వంటి డిజైన్లు కలిగి ఉంటుంది. ఈ నిర్మాణానికి గ్రానైట్, సున్నపురాయి, పైవేరజ్డ్ పాలరాయితో తయారు చేశారు. ఇది సుమారుగా 14000 టన్నుల బరువు ఉంటుంది.
గోల్కొండ కోటను చార్మినార్కు కలుపుతూ ఒక భూగర్భ సొరంగం ఉన్నట్లు ఒక పురాణం కూడా ఉంది. బహుశా ఆ సొరంగం స్థానం తెలియనప్పటికీ ఒక ముట్టడి సందర్భంలో కుతుబ్షాహీ పాలకులకు తప్పించుకునే మార్గంగా దీన్ని ఉపయోగించినట్టు తెలుస్తుంది.
నాలుగు దిశలలో గడియారాలను 1889లో చేర్చారు. మధ్యలో ఒక నీటి కొలను ఉంటుంది. చార్మినార్ మసీదులో ప్రార్థన చేసే ముందు ఇస్లాం అబ్లూ షన్ కోసం చిన్న ఫౌంటెన్ ఉంది.
2007లో పాకిస్తాన్ లో నివసిస్తున్న హైదరాబాది ముస్లింలు కరాచీలోని బహదూరాబాద్ చుట్టుపక్కల ప్రధాన క్రాసింగ్ వద్ద చిన్న చార్మినార్ నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయుల కల థోరాతో పాటు ఈ నిర్మాణం కనబడుతుంది.
భాగ్యలక్ష్మి దేవాలయం అనే పేరు గల హిందూ దేవాలయం చార్మినార్ వద్ద ఉంది. చార్మినార్ ను నిర్వహించే పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా దేవాలయ నిర్మాణాన్ని అనధికార నిర్మాణంగా ప్రకటించారు.
హిజ్రీ క్యాలెండర్ ప్రకారం 01-01-1000 సంవత్సరంలో చార్మినార్కు మొదటి మొహరం రోజున పునాది పడిందని చెబుతుంటారు. చార్మినార్ కట్టడానికి 444 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెక్కన్ ఆర్ కైవ్ వారం రోజులపాటు చార్మినార్ కు చెందిన అనేక ఫోటోలు మ్యాపులతో పాటు పెయింటింగ్లలో ఫోటోగ్రఫీ ప్రదర్శన నిర్వహించింది.
చార్మినార్.;- తాటి కోల పద్మావతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి