ఆటతో!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇంటికి చుట్టాలొచ్చారు.శివా జయ కన్నా  చిన్న. అందుకే తాత ఆపిల్లలకి కొత్త ఆటలు నేర్పసాగాడు.బుట్టలో ఉన్న కూరలన్నీ నేల మీద పోయించాడు.శివా కి జట్టు  హరి ఐతే జయతో రాజీ చేరింది. ఎవరు త్వరగా కూరలు వేరు చేసి వాటిపేరు చెప్పాలి.శివా హరి ఆలుగడ్డలు  ఉల్లి వంకాయ ఏరితే జయ రాజీ పచ్చిమిర్చి  చిక్కుడు దొండ ఏరారు.శివా గెల్చాడు.   పెద్ద సైజు కాయలుగదామరి.ఆ పై ఆకులు కోసి తెమ్మని వాటిని  కాగితం పై  ఆకారాలు వచ్చేలా అతికించమన్నాడు.జయ చకచకా నెమలి దీపం ఆకారంలో ఆకులు అమర్చి పోటీలో గెలిచింది. పళ్లెంలో  కొద్దిగా నూక గోధుమ రవ్వ  పెన్సిల్ చెక్కిన పొట్టుతో అంటబెట్టమన్నాడు.ఇప్పుడు నలుగురూ కల్సి చక్కగా సీనరీని ఓ అట్టపై చేశారు. అలా టి.వీ.అల్లరి లేకుండా తాత చాకచక్యంగా నేర్పాడోకదా🌺
కామెంట్‌లు