శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 బిస్మిల్లా మూలరూపం బి ఇస్మి అల్లాహ్ అంటే దైవం పేరుమీదే అని అర్ధం.కాని ఇప్పుడు దాని అర్ధం.ప్రారంభం!బిస్మిల్లా కరో అంటారు.ఏపని చేసినా జంతువుని చంపినా దైవం పేరుతో చేస్తారు.క్రమంగా దీని అర్ధం ప్రారంభంగా మారింది.ఫారశీ వారు కసాయి దుకాణాన్ని బిస్మిల్గాహ్అంటారు  బుఖార్ అంటే జ్వరం.అరబిక్ పదం.బే ఖేరే అనే ధాతువు లతో ఏర్పడింది.పొగ ఆవిరి వెలువడటం.అరబిక్ బుఖార్ అంటే ఆవిరి.శరీరంవేడిగామారి ఆవిర్లు తేలుతుందికదా?ఫారశీలో కూడా ఇదే అర్ధం.బఘేలీలో బ్వాఖారే ఐందిబుఖార్ అంటే జ్వరం.అరబిక్ పదం.బే ఖేరే అనే ధాతువు లతో ఏర్పడింది.పొగ ఆవిరి వెలువడటం.అరబిక్ బుఖార్ అంటే ఆవిరి.శరీరంవేడిగామారి ఆవిర్లు తేలుతుందికదా?ఫారశీలో కూడా ఇదే అర్ధం.బఘేలీలో బ్వాఖారే ఐంది. బృహన్నల అంటే నపుంసకుడు హిజడా అని అర్ధం.ఇప్పుడు థర్డ్ జెండర్ అంటున్నాం.ఇది అగ్నాతవాసంలో అర్జునుడి వేషం.విరాటరాజు కొలువులో ఆయన కూతురు ఉత్తరకి ఆటపాట నేర్పాడు.ఊర్వశి శాపంతో ఓ ఏడాదిపాటు బృహన్నల గా ఉండి ఉత్తర గోగ్రహణ సమయంలో
ఉత్తరకుమారుడికి సాయం జేశాడు.బెకనాట్  అనే పదం ఋగ్వేదంలో ఉంది.వడ్డితీసుకుని వ్యాపారంలో రెట్టింపు లాభం పొందేవారు అని మహర్షి యాస్కుడు చెప్పాడు.వారిని పణి అంటారు.ఈపదం నుంచివణి
వణిక్ బానీ బనియా అనే పదాలు వచ్చాయి.మరాఠీలో వాణీ అంటారు.తమ ధనాన్ని రెట్టింపు చేసే ఆలోచన వారిది.పూంజీపతి వడ్డీ వ్యాపారి అని పిలుస్తారు
కామెంట్‌లు