సమస్యలేని మనిషిలేడు
ఇబ్బందిలేని జీవితం ఇటుకరాయితో సరి
అదైనా కట్టుబడికోసమే కదా!
ఒక విషయంపై...
వాదన చేయడం, విరుచుకుపడ్డం, ఖండన మండనల కంటే
సానుకూలంగా చర్చించి
పరిష్కారం కనుగొంటే మేలు!
వితండవాదులు అనే జాతి
ఒకరు చెప్పేది వినరు
వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి
ముడిపెట్టి మనస్తాపం పొంది
అవతలవాళ్ళు కూడ బెం బేలు పడేలా
చేసి అదో ఆనందం!
చర్చలు జీవితంలో హాయినీ
సంయమనం దారిని చూపుతూ
అవతలవాళ్ళని గౌరవంగా
చూసేలా తోడ్పడుతాయి!
ఎంతకీ తెగని చర్చలు,
మరో సమస్య వచ్చినపుడు
పరిష్కారం దొరకడం క్లిష్టం!
సామ్రాజ్య నేతలైనా చర్చలతో
లాభంపొందాలని చూస్తారు!
వాళ్ళకంటే గొప్పవాళ్ళమా మనం?
చర్చల్లో ఊహకందని విషయాలు సైతం
బైటకొచ్చి ఆశ్చర్యపరుస్తాయి!
మండోదరి జ్ఞాని!
ఓ పద్యం ఉంది..
సింధుర రథ, ఘోటక, భట
బంధుర బలతతులు సతులు బంధులు తెగినన్
సంధికి రిపులొల్లరు దశ
కంధర పదునిదియె సంధికార్యంబునకున్!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి