మనసంతా మురిసే
సంతసాలు నిండితే
పచ్చని బ్రతుకంతా
విరిసిన వసంతమే!
మదిలో వెలిగిన
కళకళల ఆనవాలు
కళ్ళలో కొలువున్న
కలల చిరునామానే!
ఆశల పోరాటంలో
అలుపెరగని ప్రయత్నాలు
సాగరం వీడని
ఆరాటపు కెరటాలే!
దక్కిన అణువంత నీరైనా
పచ్చగ మారి పుత్తడి నేలకు
పట్టుపుట్టము కట్టపెట్టు
పచ్చిక ప్రేమ ఆరాధనే!
నునువెచ్చని స్పర్శకు
అరవిచ్చిన పువ్వుల
అమాయకపు నవ్వులు
వెలుగుబంతికి ఆహ్వానములే!
కదిలే సన్నని అలల
జలతరంగపు సవ్వడి
కిరణాల తీగలు పలికే
కనకవీణ కమ్మనిరాగాలే!
గగనపు గుమ్మాన
విరిసిన సిందూర వర్ణాలు
కాంతికలశపు స్వాగతానికి
పరచిన ఎర్ర తివాచీయే!
కళలు విరిసే కమ్మని వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి