* చిత్ర కవిత *;- * నిజ నాయకుడు *- కోరాడ నరసింహా రావు !
 నిలువనీడ లేకున్నా.... 
  గుడ్డకి, గూటికి కరువైనా.... 
    బ్రతుకుతున్న ప్రాంతమే  తన సామ్రాజ్యంగా..., 
    కూచునే చోటునేసింహాసనం చేసుకుని..., 
   చక్రవర్తిలా బ్రతికే బ్రతుకే... 
బ్రతుకురా బిడ్డా.... !
 
వాహ్.... !
       బ్రతుకంటే... నీదేరా చిన్నా 
 నాయకులుగా ఏ ఒక్కరూ పుట్టర్రా  నైనా...., 
           నాయకత్వ లక్షణాలను
పెంపొందించుకో గలవారే నాయకులు కాగలరు !
భవిష్యత్తులో నీవే.... 
  నీచుట్టూ ఉన్నవారికి.... 
    కూడు, గుడ్డ, గూడులకు ఏలోటూ రానీయక వారి మనసులను ఏలగల నిజమైన నాయకుడవు కాగలవు !
ఈ సమాజానికి నిజమైన నాయకుడవు నీవెరా కన్నా !!

కామెంట్‌లు