పంచుకోలేని నా గాథ; కె . కవిత
ప్రక్రియ:సున్నితం
--------------------------
మరువని జ్ఞాపకాలు కోకొల్లలు
తీపి చేదుల కలయికలు
వెల్లువలా ఉప్పొంగే కెరటాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఏమీ తెలియని ప్రాయంలో
శూర్పణఖ ప్రవేశించెను ఇంటిలో
మనశాంతి
కరువాయె అందరిలో
చూడచక్కని తెలుగు సున్నితంబు

నాది అర్థంకాని స్థితి 
ఎవరినీ ప్రశ్నించలేని పరిస్థితి
జీవితం కన్నీళ్ళ దుస్థితి
చూడచక్కని తెలుగు సున్నితంబు

చదువుల్లో రాణించే నేను
కల్లోలమనే సుడిలో చిక్కాను
అన్నిటిలో వెనుక పడ్డాను
చూడచక్కని తెలుగు సున్నితంబు

ప్రశాంతత కోసం వెతుకులాట
నాకైనేనే ఏర్పరచా పూలబాట
విధిరాతను ఎవరూ తప్పించలేరట
చూడచక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు