టైము;- - జయా
 మనం దేనికోసమో ఎవరికోసమో 
నిరీక్షిస్తున్నప్పుడు "టైము" నెమ్మదిగా కదులుతున్నట్లనిపిస్తుంది.
మనం వెళ్ళవలసిన చోటుకి ఆలస్యం అయినప్పుడు "టైము" వేగంగా కదిలినట్లనిపిస్తుంది.
మనం బాధలోనో కంగారులోనో ఉన్నప్పుడు "టైము" ప్రాణాంతకంగా అనిపిస్తుంది.
మనం సంతోషంగా ఉన్నప్పుడు "టైము" తక్కువైనట్లనిపిస్తుంది.
మనం విసుగుతో ఉన్నప్పుడు "టైము"  అసలు కదులుతున్నాదా అనిపిస్తుంది.
నిజానికి టైము తనదైన తీరులోనే
సాగుతుంటుంది. అందులో వేగమూ నిదానమూ అనేవేమీ ఉండవు.
కానీ ప్రతిసారి, టైములో అనిపించే మార్పులన్నీ మన మానసికావస్థలే...మన పరిస్థితులు ఒక్కోలా అన్పిస్తుంటాయి.

కామెంట్‌లు