అయ్యలూ...
కొరకరాని కొయ్యలూ... !
చిట్టి తాతయ్యలూ... !!
తియ్యండి బ్రష్షులు...
తోమండీ పల్లు .....
కడగండి ముఖాలు...
చెయ్యండి హోము వర్కులు
ముగించండి స్నానాలు
తినండి చద్ది బువ్వలు
వెయ్యండి యూనిఫారాలు
ఎక్కడున్నాయి సాక్సులు ?
తొడగండీ బూటు లు !
అదిగో బడి గంటలు...
ఇరిగో మీ స్నేహితులు...
శ్రద్దగా వినండి పాఠాలు !
చక్కగ సాగాలిమీచదువులు
కలిసి - మెలిసి ఆడాలి ఆటలు
నేర్చుకోవాలి మంచి పాటలు
ఉన్నతమవ్వాలి మీ బ్రతుకులు
మామది నిండాలి ఆనందాలు !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి